Share News

సమ సమాజ స్థాపనకు మార్క్స్‌ ఎనలేని కృషి

ABN , Publish Date - May 05 , 2025 | 11:38 PM

సమ సమాజ స్థాపనకు కారల్‌ మార్క్స్‌ ఎనలేని కృషి చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ అన్నారు.

సమ సమాజ స్థాపనకు మార్క్స్‌ ఎనలేని కృషి

చౌటుప్పల్‌ టౌన, మే 5 ( ఆంధ్రజ్యోతి): సమ సమాజ స్థాపనకు కారల్‌ మార్క్స్‌ ఎనలేని కృషి చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ అన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలోని కందాళ రంగారెడ్డి భవనలో సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో కారల్‌ మార్క్స్‌ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూరుగు కృష్ణా రెడ్డి, పట్టణ కార్యదర్శి గోశిక కరుణాకర్‌, నాయకులు కె.నర్సింహ, రాగీరు కిష్టయ్య, బొజ్జ బాలయ్య, బత్తుల దాసు, బోయ యాదయ్య, ఖయ్యూమ్‌, శ్రీను, బత్తుల జయమ్మ, శ్రీనివాస్‌ రెడ్డి, కె.శివ, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2025 | 11:38 PM