Share News

నకిలీ బంగారం విక్రయించిన వ్యక్తి రిమాండ్‌

ABN , Publish Date - May 25 , 2025 | 12:13 AM

మేళ్లచెర్వు, మే 24(ఆంధ్రజ్యోతి) : తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని నకిలీ బంగారం విక్రయించిన వ్యక్తినిపోలీసులు రిమాండ్‌కు తరలించారు.

 నకిలీ బంగారం విక్రయించిన వ్యక్తి రిమాండ్‌

మేళ్లచెర్వు, మే 24(ఆంధ్రజ్యోతి) : తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని నకిలీ బంగారం విక్రయించిన వ్యక్తినిపోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ పరమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం, చిక్‌బలాపూర్‌లోని అక్కిబక్కి కాలనీకి చెందిన హెచఆర్‌ అశోక్‌ గత నెల 20వ న సూర్యాపేట జిల్లా మేళ్ల చెర్వు మండల కేంద్రంలోని పొలాల వద్ద తాను ఏపీలోని అనంతపూర్‌కు చెందిన వ్యక్తిని అని బురకపిట్టలు పట్టుకొని జీవిస్తుంటానని స్థానికులకు పరిచయం చేసుకున్నాడు. స్థానికుల ఫోన నంబర్లు సేకరించి గత నెల 28న తన బంధువు ఎక్స్‌క్‌వేటర్‌ ఆపరేటర్‌గా చేస్తుండగా పొలంలో బంగారర దొరికిందని, తక్కువ ధరకు విక్రయిస్తామని మండల కేంద్రానికి చెందిన ఇరిగిల శంభిరెడ్డి, చింతరెడ్డి రామ్‌రెడ్డిని నమ్మించాడు. అనంతపూర్‌ రావాల్సిందిగా పదే పదే కోరటంతో ఏప్రిల్‌ 30న శంభిరెడ్డి, రామిరెడ్డి అనంతపురం వెళ్లగా శాంపిల్‌గా గ్రాము బంగారాన్ని ఉచితంగా ఇచ్చాడు. దానిని స్థానికంగా పరిక్షించగా మేలిమి బంగారంగా తేలడంతో ఈ నెల 6న హిందూపూర్‌ వెళ్లి రూ. 3లక్షలతో సుమారు 500 గ్రాముల బంగారు గొలుసు కొనుగోలు చేశారు. అనంతరం దానిని స్థానికంగా పరిశీలించగా నకిలీ బంగారం అని తేలడంతో తాము మోసపోయామని, ఈ నెల 13వ తేదీన స్థానిక పోలీ్‌సస్టేషనలో బాధితులు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం మండల కేంద్రంలో సాధారణ తనిఖీల్లో నిందితుడు అశోక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుడి నుంచి కొంత నగదును రికవరీ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - May 25 , 2025 | 12:13 AM