Share News

చేనేత సదస్సును విజయవంతం చేయాలి

ABN , Publish Date - May 01 , 2025 | 01:31 AM

పట్టణంలో ఈనెల 2వ తేదీన నిర్వహించే ‘చేనేత సదస్సు’ను విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు తడక వెంకటేష్‌ పిలుపు నిచ్చారు.

  చేనేత సదస్సును విజయవంతం చేయాలి

భూదానపోచంపల్లి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలో ఈనెల 2వ తేదీన నిర్వహించే ‘చేనేత సదస్సు’ను విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు తడక వెంకటేష్‌ పిలుపు నిచ్చారు. బుధవారం పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనంలో నిర్వహించిన చేనేత సంఘాల ప్రతినిధుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 2న రాష్ట్ర చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఈ సదస్సుకు హాజరవుతారని, సంఘం బాధ్యులు సకాలంలో హాజరుకావాలని కోరారు.

Updated Date - May 01 , 2025 | 01:31 AM