ఎల్‌ఆర్‌ఎస్ ఆదాయం అంతంతే!
ABN , Publish Date - May 06 , 2025 | 12:15 AM
భూ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎ్‌స)పై ఉమ్మడి జిల్లాలో ఆశించిన ఫలితం దక్కడంలేదు. 2020లో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని పొడిగిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులోగా నిలిపివేయాలని ప్రభుత్వం భావించింది.
ఉమ్మడి జిల్లాలో రూ.107.57కోట్లు వసూలు
భారీగా వచ్చిన దరఖాస్తులు
పరిష్కారమవుతున్నవి స్వల్పమే
అధికారులకు దృష్టిపెట్టడంలేదనే విమర్శలు
జూన్ 3 వరకు మరోసారి గడువు పెంచిన ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): భూ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎ్‌స)పై ఉమ్మడి జిల్లాలో ఆశించిన ఫలితం దక్కడంలేదు. 2020లో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని పొడిగిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులోగా నిలిపివేయాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం 25శాతం రాయితీ కూడా ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఆశించిన రీతిలో దరఖాస్తులు పరిష్కారమవకపోవడంతో అనుకున్నమేర ఆదాయం రాలేదు. తాజాగా మరోసారి జూన్ 3వ తేదీ వరకు దరఖాస్తుల నమోదు, పరిష్కారానికి గడువుపెంచింది. ఈసారైనా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంటే, ఈ దఫాలోనైనా సర్వర్ల సమస్యలు, క్షేత్ర పరిశీలన పేరుతో దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిష్కరించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 19 మునిసిపాలిటీలకు నందికొండ (నాగార్జునసాగర్) మునిసిపాలిటీలో ప్రభుత్వ స్థలాలేవీ లేవు. ఉన్న స్థలాలన్నీ ఎన్నెస్పీ, అటవీశాఖకు చెందినవే కావడంతో ఇక్కడ ఎల్‌ఆర్‌ఎ్‌సకు మునిసిపల్‌శాఖ నోటిఫికేషన్ జారీచేయలేదు. మిగిలిన 18 మునిసిపాలిటీల్లో ఇప్పటివరకు 1,95,173 దరఖాస్తులు రాగా, 39,260 పరిష్కారమవడంతో రూ.107.57కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఇంకా సుమారు 38వేల పైచిలుకు దరఖాస్తులు ఆమోదం పొందినా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తికాలేదు. మిగిలిన దరఖాస్తులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రత్యేక వెబ్‌సైట్ అయినా సాంకేతిక సమస్యలు..
భూములను క్రమబద్ధీకరించి ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. యూజర్ మ్యాన్యువల్ ప్రీ రిజిస్ట్రేషన్ ఎల్‌ఆర్‌ఎస్ (ల్యాండ్ రెగ్యులేటరీ స్కీం-2020) పేరుతో ఈ వెబ్‌సైట్ ఏర్పాటుచేసింది. అంతేగాక ఆక్రమిత భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకొచ్చే దరఖాస్తుదారులకు వన్‌టైం సెటిల్‌మెంట్ అమ లు చేసి నిర్ధారిత ఫీజులో 25శాతం రాయితీ కూడా ప్రకటించిం ది.అయితే సర్వర్లు బిజీగా ఉండడం, ఆన్‌లైన్ ప్రక్రియ ముంద కు సాగకపోవడం, ఆక్రమిత స్థలాలు, భవనాల యజమానులు ముందుకు రాకపోవడంతో ఈ ప్రక్రియ మందకొడిగా సాగింది. ప్రధానంగా క్షేత్ర పరిశీలన ప్రక్రియ జాప్యమవడం, మొదటి దశలోనే దరఖాస్తు అప్‌లోడ్ కాకుండా ఆటంకాలు ఎదరువుతుండడం వంటి కారణాలతో క్రమబద్ధీకరణలో వేగం తగ్గింది. పైగా దరఖాస్తుదారులకు నేరుగా ఆటోజనరేటెడ్ మెసెజ్‌లు వె ళ్లడంతో వారంతా ఒకేసారి మునిసిపల్ కార్యాలయాల వద్ద బా రులుతీరారు. దీంతో సర్వర్లు మొరాయించడం వంటి సాంకేతిక సమస్యలు క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఆటంకంగా మారింది.
క్షేత్రస్థాయి పరిశీలన పేరుతోనే ఎక్కువ పెండింగ్..
మునిసిపల్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియలో చేస్తున్న జాప్యం వల్లే ఎక్కువ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా నల్లగొం డ, సూర్యాపేట, భువనగిరి వంటి పాత మునిసిపాలిటీల్లో భారీ గా దరఖాస్తులు రావడంతో క్షేత్రస్థాయి పరిశీలన ఇబ్బందికరం గా మారిందని, ఉద్యోగులకు సమయాభావంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలు చేసినవారు, ప్రభుత్వ పార్కులు, వాటర్‌బాడీ్‌సలోకి చొచ్చుకెళ్లిన వారు, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసినవారు సైతం ఈ ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తు చేసుకున్నారని, దీంతో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ జాప్యమయిందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
పెంచిన గడువులోనైనా దరఖాస్తులు పరిష్కరించాలి
ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తు చేసుకుంటే సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఎల్-1 దశలోనే దరఖాస్తులకు బ్రేకులు పడుతున్నాయని వినియోగదారుల వాపోతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు మూడంచెల విధానాన్ని అమలుచేస్తున్నారు. క్రమబద్ధీకరణకు సర్వర్ సమస్యలు, ఇతర సమస్యల నేపథ్యంలో ఎల్-1వద్దనే బ్రేకులు పడడంతో ఉమ్మడి జిల్లాలో పెద్దసంఖ్యలో దరఖాస్తులకు మోక్షం కలగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి ఆదాయమిచ్చే పథకం కావడంతో అధికారులు దృష్టిసారించి గడువు పెంచిన జూన్ 3లోగానైనా అప్‌లోడ్ చేసిన దరఖాస్తులను పరిష్కరించి, రిజిస్ట్రేషన్లకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ ఇలా...
మునిసిపాలిటీ వచ్చిన పరిష్కారమైనవి ఆదాయం
దరఖాస్తులు (రూ.కోట్లలో)
నల్లగొండ 36,140 3388 20.87
సూర్యాపేట 35,633 6587 20.95
భువనగిరి 15,602 4386 11.99
మిర్యాలగూడ 14,336 2652 11.95
దేవరకొండ 5022 3411 0.75
హాలియా 3418 621 1.35
చిట్యాల 3209 480 1.06
నకిరేకల్ 7080 605 1.20
చండూరు 3632 513 0.91
కోదాడ 16000 3600 12.00
నేరేడుచర్ల 3157 692 0.57
హుజూర్‌నగర్ 4425 826 2.43
తిరుమలగిరి 6036 745 1.26
ఆలేరు 4700 1180 2.34
చౌటుప్పల్ 16,571 4087 7.01
యాదగిరిగుట్ట 9000 2800 4.45
మోత్కూరు 3,660 1012 1.95
పోచంపల్లి 7552 1675 4.53
మొత్తం 1,95,173 39,260 107.57