పాడి సహకార సంఘాల అనుసంధానం మంచి పరిణామం
ABN , Publish Date - May 31 , 2025 | 12:01 AM
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పాడి సహకార సంఘాలను అనుసంధానం చేయడం మంచి పరిణామమని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో డీసీసీబీ బ్యాంకులో డీసీవోలు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి
నల్లగొండ, మే 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పాడి సహకార సంఘాలను అనుసంధానం చేయడం మంచి పరిణామమని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో డీసీసీబీ బ్యాంకులో డీసీవోలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2025-26 సంవత్సరా న్ని అంతర్జాతీయ సహకార సంఘంగా ప్రకటించిన సందర్భంగా జాతీ య స్థాయిలో సహకార సంస్థలను అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో సహకార సంస్థలు బలోపేతం అవుతాయన్నారు. అదేవిధంగా ప్రాథమిక పాడి సహకార సంఘాలు డీసీసీబీ బ్యాంకులో సేవింగ్ ఖాతాలు తెరవాలని కోరారు. ఈ ఖాతాలకు మైక్రో ఏటీఎం, రూపే కిసాన్ కార్డులతో పాటు అన్ని డిజిటల్ లావాదేవీల సదుపాయాలను కల్పిస్తామన్నారు. డీసీసీబీ నుంచి పీఎంఈజీపీ కింద డెయిరీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. త్వరలోనే కొత్త జేఎల్‌జీ గ్రూపులు ఏర్పాటు చేసి వారికి నాబార్డు సహాయంతో రుణాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీవో పత్యనాయక్, సీఈవో శంకర్‌రావు, జీఎం నర్మద, తదితరులు పాల్గొన్నారు.