దైవచింతనతో జీవితం ధన్యం
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:08 AM
దైవచింతనలో గడిపే వారి జీవితం ధన్యమని, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుతాయని శుభవార్త దేవాలయ విచారణ గురువు పసల మార్టిన్ అన్నారు.
మఠంపల్లి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : దైవచింతనలో గడిపే వారి జీవితం ధన్యమని, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుతాయని శుభవార్త దేవాలయ విచారణ గురువు పసల మార్టిన్ అన్నారు. దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మఠంపల్లి శుభవార్త దేవాలయంలో రెండు రోజులుగా జరుగుతున్న వార్షిక వేడుకలు శనివారం పెద్దలపూజతో ముగిసాయి. ఉదయం 7గంటలకు క్రైస్తవ కుటుంబాలలో మరణించి వారి కోసం దివ్యబలిపూజ(పెద్దల పూజ)ను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణ గురువు మాట్లాడుతూ లోక రక్షణార్థమే ఏసు జననం అన్నారు. ప్రతి ఒక్కరూ సేవభావంతో పనిచేయాలని, తోటి వారికి సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలన్నారు.
రెండు రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు, క్రైస్తవులు తరలివచ్చారు. కార్యక్రమంలో ఫాదర్లు సలిబండ్ల బాలశౌరి, బాల్‌రెడ్డి, కాకుమాను రాజు, అల్లంబాల, రాజేష్, సబాస్టిన, చర్చి పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అట్టహాసంగా ఎద్దులపందేలు ప్రారంభం
శుభవార్త దేవాలయ వార్షిక వేడుకల సందర్భంగా శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ- ఆంధ్రప్రదేశ రాష్ట్రాల స్థాయి ఎద్దుల బండలాగు బలప్రదర్శన పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను దేవాలయ విచారణ గురువు మార్టిన పసల, మఠంపల్లి మాజీ సర్పంచ ఆదూరి కిషోర్‌రెడ్డిలు ప్రారంభించారు. మొదటిరోజు నాలుగు పండ్ల విభాగంలో 11 జతల ఎద్దులు పాల్గొన్నాయి. పెద్దఎత్తున ప్రేక్షకులు, అభిమానులు రాకతో వీవీ మైదానం కిటకిటలాడి పండుగ వాతవరణం నెలకొంది. కార్యర్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారతరెడ్డి, ఫాదర్ వినోద్‌రెడ్డి, ఆదూరి మధుసూదనరెడ్డి, శౌరెడ్డి, జడ్డు జలబాల్‌రెడ్డి, కె.చిన్నపురెడ్డి, భాస్కర్‌రెడ్డి, బాలశౌర్రెడ్డి, గాదె పవనరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రంజితరెడ్డి, సిస్టర్ రూబీ, సుజాత, అలంబాల్‌రెడ్డి, అంతోనరెడ్డి, లూర్ధురెడ్డి, చర్చిపెద్దలు, సంఘంసభ్యులు పాల్గొన్నారు.