Share News

ఆధ్యాత్మిక కేంద్రంగా కొలనుపాకను తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:39 AM

కొ లనుపాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. కొలనుపాక నుంచి సిద్ధిపేటకు వెళ్లే పెద్ద వాగు పై రూ.4.50కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనుల ను, కొలనుపాక గ్రామం వద్ద బ్రిడ్జిని రూ.15కోట్ల తో, నాలుగు లేన్ల రోడ్డు మార్గంతో పాటు సెంట్ర ల్‌ లైటింగ్‌ ఏర్పాటు పనులను ప్రారంభించారు.

ఆధ్యాత్మిక కేంద్రంగా కొలనుపాకను తీర్చిదిద్దుతాం

ప్రభుత్వ బీర్ల అయిలయ్య

ఆలేరు రూరల్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): కొ లనుపాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. కొలనుపాక నుంచి సిద్ధిపేటకు వెళ్లే పెద్ద వాగు పై రూ.4.50కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనుల ను, కొలనుపాక గ్రామం వద్ద బ్రిడ్జిని రూ.15కోట్ల తో, నాలుగు లేన్ల రోడ్డు మార్గంతో పాటు సెంట్ర ల్‌ లైటింగ్‌ ఏర్పాటు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొలనుపాక గ్రామం భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఉద్యమాలకు ఊపిరిగా నిలిచిందన్నారు. ఇక్కడున్న సోమేశ్వరాలయం, వీరనారాయణ స్వామి ఆలయం, జైన్‌ మందిర్‌ దేశంలో ప్రఖ్యా తి చెందాయన్నారు. వర్షాకాలంలో గ్రామం నుం చి రెండు వాగులు ప్రవహిస్తుండడంతో లంకలా గా ఉంటుందని, నాలుగు గ్రామాలు జల దిగ్బంధంలో కొట్టు మిట్టాడాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. రెండు బ్రిడ్జిలను కాంట్రాక్టర్లు నాలుగు నెలల్లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. టూరిజం శాఖతో కలిసి కొలనుపాకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, నాయకులు ఎల్లంల సంజీవరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చైతన్యరెడ్డి, గొట్టం విజయేందర్‌రెడ్డి, గాదె సోమిరెడ్డి, మాందాల నర్సింహులు, నీలం పద్మ, గంధమల్ల అశోక్‌, ఆరె ప్రశాంత్‌గౌడ్‌, మామిడాల నర్సింహులు, అయిలయ్య, చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎ్‌సను తరిమికొట్టాలి

అంబేడ్కర్‌ను అవమానపరుస్తున్న కేంద్రంలో ని మోదీ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని అన్ని విధాలు గా అభివృద్ధి చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని దురుద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎ్‌సను తరిమికొట్టాలని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య పిలుపునిచ్చారు. కొలనుపాకలో అం బేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి జై బా పూ.. జై భీమ్‌.. జై సంవిధాన్‌ కార్యక్రమంలో మాట్లాడారు. రాజ్యాంగానికి ఎలాంటి ప్రమాదం జరిగినా దేశ ప్రజల పక్షాన సోనియా గాంధీ, రా హుల్‌గాంధీ అండగా నిలుస్తారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కొలనుపాక అభివృద్ధిలో భాగంగా దుకాణాలు కోల్పోతున్న వారికి దుకాణాలు ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తామన్నారు. అనంతరం దళితవాడలో సన్నబియ్యంతో వండిన భోజనాన్ని భుజించారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం:బీర్ల

(ఆంధ్రజ్యోతి, రాజాపేట): రైతుల సంక్షేమ మే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అయినాల చైతన్య మహేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ చిలువేర్‌ బాలరాజ్‌, విఠల్‌నాయక్‌, మండల ప్రత్యేకాధికారి శాంతినిర్మల, మండల వ్యవసాయాధికారి పద్మజ, సహకార సంఘం చైర్మన్‌ చింతలపురి భాస్కర్‌రెడ్డి, నాయకులు బుడిగె పెంటయ్య, రేణుక, నాగరాజు, ఉపేందర్‌, రాంజీనాయక్‌, సుమలత, లక్ష్మారెడ్డి, శ్రీశైలం, సిద్దులు సురేందర్‌, నవీన్‌, బక్కయ్య, నర్సింహారెడ్డి, గాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:39 AM