లంబోదరుడికి లక్ష ఉండ్రాళ్లు
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:40 AM
గణేష్ నవరాత్రి ఉత్సవాలను సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.
తిరుమలగిరి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : గణేష్ నవరాత్రి ఉత్సవాలను సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం పట్టణంలోని క్రాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద స్వామివారికి మహిళా భక్తులు లక్ష ఉండ్రాళ్ల ప్రసాదం నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో నిర్వాహణ కమిటీ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాపాక సోమేష్, గజ్జి ఉపేందర్, తిప్పిరిశెట్టి లక్ష్మణ్, గబ్బెట సంపతకుమార్, బుక్క శ్రీనివాస్, మూల వెంకట్‌రెడ్డి, జైన వీరప్రసాద్, దిడిగం శ్రీధర్, మహిళా భక్తులు పాల్గొన్నారు.