పాఠశాలల్లో మౌలిక వసతులు కరువు
ABN , Publish Date - May 24 , 2025 | 12:08 AM
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయా లు కరువయ్యాయి. పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయా లు కరువయ్యాయి. పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో భయాందోళన నడు మ విద్యార్థులు కాలం వెల్లబుచ్చాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి. నీటి సౌకర్యం లేకపో గా, తలుపులు సరిగా లేకుండాపోయాయి. ప్రహరీలు లేక ఆవరణల్లో పశువుల సంచరిస్తున్నాయి. క్రీడా మైదానాలు లేక విద్యార్థులు ఆటల కు దూరమవుతున్నారు. జిల్లా కేంద్రంలోని పాఠశాలల పరిస్థితి ఇందుకు భిన్నమేమీ కాదు. సూ ర్యాపేటలోని ప్రభుత్వ హైస్కూల్ నెంబర్.2, గం డూరి జానకమ్మ మెమోరియల్ పాఠశాలలకు క్రీడా మైదానాలు లేవు. పాఠశాలలు ప్రారంభమై న తర్వాత మరమ్మతులకు ఇబ్బందిగా ఉంటుంది అయినా సమస్యలను పరిష్కరించాల్సిన విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది.
- (ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్)
సూర్యాపేట నియోజకవర్గంలోని పెనపహాడ్ మండలం రత్యాతండ, మున్యాతండ, జల్మాలకుంట తండ, దోసపహాడ్, అనాజిపురం, చిన్నగారకుంటతండ, రంగయ్యగూడెం, అనంతారం గ్రా మాల్లోని పాఠశాలలకు ప్రహరీలు లేవు. అదేవిధంగా నారాయణగూడెం, నూర్జహానపేట, చెట్లముకుందాపురం, నాగులపాటిఅన్నారం ప్రాథమి క పాఠశాలల్లో తరగతి గదులు శిథిలావస్థకు చే రి కూలిపోయే దశకు చేరాయి. ఏడాది కిందట నాగులపాటిఅన్నారం ప్రాథమిక పాఠశాలలో మ రుగుదొడ్లను నిర్మించినా స్వీపర్ లేడనే కారణం తో నేటికీ వాటి వేసిన తాళాలు తీయలేదు. దీం తో విద్యార్థులు బాటిళ్లలో నీళ్లు తీసుకెళ్తూ కాలకృత్యాలకు బయటకు తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్‌లోని ఉన్నత పాఠశాలలో తరగతి గదులు శిథిలావస్థ కు చేరడంతో వర్షాలు వస్తే విద్యార్థులకు సెలవు లు ఇస్తున్నారు. మండలంలో సగానికి పైగా ప్రాథమిక పాఠశాలల్లో వంట గదుల్లేవు దీంతో ఆరుబయట వంటలు చేస్తున్నారు. నెమ్మికల్‌లోని ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి నిర్మాణాలు ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్నాయి.
చివ్వెంల మండలంలోని పలుపాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. మండలంలోని ప లు గ్రామాల్లో నూతనంగా తరగతి గదులు నిర్మించారు.
తిరుమలగిరి మండలంలో ఆరు ఉన్నత, 2 ప్రాథమికోన్నత, 35 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అందులో 30 పాఠశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజనం వంట గదులు ఉన్నాయి. చాలా పాఠశాలలకు ప్రహరీలు లేకపోగా వర్షా లు పడ్డాయంటే తరగతి గదులు కురుస్తాయంటున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మన ఊరు-మన బడి పథకంలో 15 పాఠశాలలకు నిధులు మంజూరు కాగా అందులో రెండు, మూడు పా ఠశాలల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి. కాం గ్రెస్ ప్రభుత్వంలో 25 పాఠశాలలను అమ్మ ఆద ర్శ పాఠశాలల కింద ఎంపిక చేయగా వాటిల్లో పనులు పూర్తి కాలేదు. చేసిన పనులకు ప్రభు త్వం నుంచి బిల్లులు రాక పోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని చెబుతున్నారు.
సూర్యాపేట నియోజకవర్గంలో
ప్రభుత్వ పాఠశాలలు 237 ఉన్నాయి. అందులో ప్రాథమిక 168, ప్రాథమికోన్నత 24, ఉన్నత పాఠశాలలు 45 ఉన్నాయి. సూర్యాపేట పట్టణంతో పాటు మండలంలో ప్రాథమిక 45, ప్రాథమికోన్నత 10, ఉన్నత పాఠశాలలు 16 ఉన్నాయి.
మండలం ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత
చివ్వెంల 43 4 9
పెనపహాడ్ 40 4 8
ఆత్మకూరు(ఎస్) 40 6 12
పాఠశాలల భవనాల పరిస్థితులపై నివేదిక తీసుకుంటున్నాం
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పాత భవనాల పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఇంజనీర్లను కోరాం. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద పలుచోట్ల మరమ్మత్తులు చేయించాం. నూతన తరగతి గదుల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగానే నిర్మాణాలు చేపడతాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్నిరకాల వసతులు కల్పిస్తాం. మరుగుదొడ్ల మరమ్మతు పనులు కూడా పూర్తి చేశాం.
- అశోక్‌కుమార్, డీఈవో సూర్యాపేట.