బలహీన వర్గాల ఆశాజ్యోతి కొనపురి రాములు
ABN , Publish Date - May 12 , 2025 | 12:28 AM
వలిగొండ, మే 11 (ఆంధ్రజ్యోతి): బలహీన వర్గాల ఆశాజ్యోతి కొనపురి రాములు అని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గఇనచార్జి క్యామ మల్లేష్ అన్నారు.
మండలంలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో ఆదివారం రాము లు 11వ వర్థంతిని ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు ఆయన స్థూపం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో రాములు సాగించిన పోరాటం మరువలేనిదన్నారు. ఆయన ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకటేశం, రాములు సతీమణి కునపురి కవిత, నాయకులు సంజీవరెడ్డి పాండారి, మమత, శంకర్, కిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.