Share News

పేట మార్కెట్‌కు ఖమ్మం ధాన్యం

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:21 AM

:సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ కు శుక్రవారం ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు ధాన్యం తీసుకువచ్చారు. గ్రామంలోని ఓకేంద్రంలో గ్రామానికి చెం దిన ఉపేందర్‌,రవి, రాంబాబులు 350 బస్తాల ధాన్యం కాంటాలు వేయించారు.

పేట మార్కెట్‌కు  ఖమ్మం ధాన్యం
సూర్యాపేట మార్కెట్‌లో ధాన్యం రాశులు

నేలకొండపల్లిలో మిల్లర్‌ దిగుమతికి నిరాకరణ

రెండురోజులు ఆగి సూర్యాపేట తరలించిన రైతులు

భానుపురి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి):సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ కు శుక్రవారం ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు ధాన్యం తీసుకువచ్చారు. గ్రామంలోని ఓకేంద్రంలో గ్రామానికి చెం దిన ఉపేందర్‌,రవి, రాంబాబులు 350 బస్తాల ధాన్యం కాంటాలు వేయించారు. ఆధాన్యాన్ని స్థానిక నేలకొండపల్లి రైస్‌మిల్లుకు కేటాయించగా, ట్రా క్టర్లలో అక్కడికి తరలించారు. అయితే రెండు రోజులువుతున్నా మిల్లర్‌ ధాన్యాన్ని దిగుమతి చేసుకోలేదు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ రోజుకు రూ.2 వేలు అదనంగా అడుగుతుండటంతో రైతులు ఆ ధాన్యాన్ని సూర్యాపేట మార్కెట్‌కు శుక్రవారం తీసుకువచ్చారు.వారు తీసుకువచ్చిన ఐఆర్‌-64 ధాన్యానికి సా ధారణ ధరతోకాంటాలు పూర్తి చేసినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు.

Updated Date - Apr 26 , 2025 | 12:21 AM