కలగానే ‘కళాభారతి’
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:20 AM
(ఆంధ్రజ్యోతి-నల్లగొండ):జిల్లా కేంద్రంలో నిర్మించతలపెట్టిన కళాభారతి నిర్మాణం కలగానే మిగిలింది. రెండేళ్ల క్రితం గత బీ ఆర్‌ఎస్ ప్రభుత్వం లాఛనంగా శంకుస్థాపన చేయగా నేటి కి పనులు ప్రారంభం కాలేదు.

(ఆంధ్రజ్యోతి-నల్లగొండ):జిల్లా కేంద్రంలో నిర్మించతలపెట్టిన కళాభారతి నిర్మాణం కలగానే మిగిలింది. రెండేళ్ల క్రితం గత బీ ఆర్‌ఎస్ ప్రభుత్వం లాఛనంగా శంకుస్థాపన చేయగా నేటి కి పనులు ప్రారంభం కాలేదు.
నల్లగొండ జిల్లా కళారంగం, సాహిత్య పరంగా ఎంతో చైతన్యవంతమైనది. తెలుగు సాహిత్యానికి ఎందరో ఉద్ధ్దండులైన సాహితీవేత్తలను అందించిన నేల ఇది. సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ఎన్నో సభలు, పుస్తకావిష్కరణలు నల్లగొండలో జరిగాయి.ఎందరో కళాకారులు ఈ జిల్లా నుంచి ఎదిగి కళా రంగాల్లో వెలుగొందారు. అలాంటి నేలపైన కవులు, కళాకారులకు వేదికలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. మునిసిపల్ శాఖ ఆధ్వర్యంలో ఐదు దశాబ్దాలుగా జిల్లా కేంద్రంలోని టౌన హాల్‌లో విశేష సేవలు అందించింది. అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వం హైదారాబాద్‌లోని రవీంద్ర భారతి మాదిరిగా నల్లగొండ జిల్లా కేం ద్రంలో కళాభారతి నిర్మించాలని తలపెట్టింది. అందుకు 2023, అక్టోబర్ 2న ఆర్బాటంగా అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అదే సమయంలో అప్పటి వరకు కవులు, కళాకారులకు సేవలందించిన టౌనహాల్‌ను నేలమట్టం చేశారు. ఆ స్థలంలో మునిసిపల్‌శాఖ తమ వాహనాల పార్కింగ్‌కు వినియోగించుకోంటుంది రెండేళ్ల నుంచి కవులు, కళాకారులకు సభలు, సమావేశాలు, కళా ప్రదర్శనలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటి రెండు నెలలు గడిచిన కళాభారతి నిర్మాణం పనులను మొదలు పెట్టలేదు.
ఇబ్బందులు పడుతున్న కళాకారులు
కవులు, కళాకారులకు సాహిత్యవేదికలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్ల నుంచి టౌనహాల్‌లో సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించుకొనేవారు. కవులు, కళాకారులు సభలు, పుస్తకావిష్కరణ సభలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేవారు. రెండేళ్లనుంచి జిల్లా కేంద్రంలోని సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాల నిర్వహణకు వేదిక లేక పోవడంతో లయన్స క్లబ్, యూటీఎఫ్ భవనం, డిగ్రీకళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తే ఇబ్బంది పడుతున్నారు. కవులు, కళాకారులు కళాభారతిని త్వరగా నిర్మించాలని అనేకసార్లు ఉన్నతాధికారులకు, జిల్లా ప్రజా ప్రతి నిధు లను కలిసి వినతి పత్రాలు అందజేశారు. అయినా ఇంత వరకు నిర్మాణం పనులు మొదలు కావడం లేదు.
మంత్రి కోమటిరెడ్డి చొరవ తీసుకోవాలి
రెండేళ్ల నుంచి సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాల వేదిక లేకపోవడం వల్ల ఇబ్బంది పడు తున్నాం. కవులు, కళాకారులకు నిలయమైన జిల్లా కేంద్రంలో సాంస్కృతిక భవనం లేక కళారంగానికి తీరనిలోటు. ఇప్పటికైనా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చొరవ తీసుకొని కళాభారతి పనులు మొదలు పెట్టే విధంగా కృషి చేయాలి.
-సాగర్ల సత్తయ్య, ప్రముఖ సాహితీవేత్త
నిధులు విడుదల కాగానే నిర్మాణం
నిధులు విడుదలైన వెంటనే టెండర్లు పిలుస్తాం. ఆ తరువాత నిర్మాణ పనులను వేగవ ంతంగా పూర్తి చేస్తాం. గడియారం సెంటర్‌లోని ప్రభుత్వం స్థలంలో కళాభారతి ఆడిటోరియం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాం. త్వరలోనే పనులను ప్రారంభిస్తాం.
-సయ్యద్ ముసాబ్ అహ్మద్, మునిసిపల్ కమిషనర్ నల్లగొండ