Share News

ఎస్సీ వర్గీకరణ అమలుతో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు న్యాయం

ABN , Publish Date - Jun 02 , 2025 | 01:02 AM

ఎస్సీ వర్గీకరణ అమలుతో రాష్ట్రంలో మాదిగలు, మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుంద ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలైన తర్వాత ఆదివారం తొలిసారిగా జిల్లాకేంద్రానికి వచ్చిన సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహను సన్మానించారు.

ఎస్సీ వర్గీకరణ అమలుతో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు న్యాయం

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

నల్లగొండ, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ అమలుతో రాష్ట్రంలో మాదిగలు, మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుంద ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలైన తర్వాత ఆదివారం తొలిసారిగా జిల్లాకేంద్రానికి వచ్చిన సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. టీపీసీపీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో మాదిగలు, మాదిగ ఉపకులాలకు ఎంతగానో న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయన్నారు. అనంతరం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్‌, మాదిగ జేఏసీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్‌ శంకర్‌ నాయక్‌, ఎమ్మార్పీఎస్‌, ఎమ్మార్పీఎస్‌ ఉపకులాలు, మాదిగ జేఏసీ నాయకులు పెరిక ఉమామహేశ్వర్‌, కత్తుల జగన్‌, కత్తుల తులసీదాస్‌, దుబ్బ రూప అశోక్‌ సుందర్‌, తలకొప్పుల గిరి, షణ్ముక, భాషపాక హరికృష్ణ, నవీన్‌, హరిప్రసాద్‌, కొప్పు అశోక్‌, నరేందర్‌, ఇరిగి ప్రసాద్‌, అశ్విని, అంజమ్మ, వోలేపల్లి రుద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 01:02 AM