Share News

నేటి నుంచి సంక్షేమ పథకాల జోష్‌

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:59 AM

:రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయనుంది. ప్రధానంగా రాజీవ్‌ యువ వికాస్‌ పథకాన్ని ప్రభు త్వం ప్రారంభించనుంది. యువత సాధికారత, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడమే లక్ష్యంతో రాజీవ్‌ యువ వికాస్‌ పథకాన్ని రూపొందించింది.

నేటి నుంచి సంక్షేమ పథకాల జోష్‌

అవతరణ దినోత్సవం నేపథ్యంలో కొత్త పథకాలు

రాజీవ్‌ యువ వికాసానికి ప్రొసీడింగ్స్‌

రైతులకు ఫౌండేషన్‌ సీడ్‌ పంపిణీ

గ్రామపాలన అధికారులకు నియామక ఉత్తర్వులు

3 నుంచి రెవెన్యూ సదస్సులు

నల్లగొండ, జూన్‌ 1 (ఆంధ్రజ్యో తి):రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయనుంది. ప్రధానంగా రాజీవ్‌ యువ వికాస్‌ పథకాన్ని ప్రభు త్వం ప్రారంభించనుంది. యువత సాధికారత, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడమే లక్ష్యంతో రాజీవ్‌ యువ వికాస్‌ పథకాన్ని రూపొందించింది. పథకంలో భాగంగా రూ. లక్షలోపు సబ్సిడీని తొలివిడత అందజేయనున్నారు.ప్రతి నెలా విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. అక్టోబ రు 2 నాటికి లబ్ధిదారులందరికీ అందజేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూన్‌ మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పైలెట్‌ ప్రాజెక్టు కిం ద చేపట్టిన ఇళ్లను ప్రారంభిస్తారు. పనులు జరుగుతున్న తీరును బట్టి లబ్ధిదారులకు విడతల వారీగా నిధులు మంజూరు చేస్తారు. జూన్‌ మొదటి వారంలో కొందరూ గృహప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు కూ డా జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త పథకాలను వేగవంతం చేయాలని నిర్ణయించి ఆయా పథకాలను అమలులోకి తీసుక వస్తున్నారు. రాజీవ్‌ యువ వికా్‌సతోపాటు గ్రామపాలన అఽధికారులకు నియామక ఉత్తర్వులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు, రైతుభరోసా పెండింగ్‌ నిధులపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించారు. అదేవిధంగా ఉద్యోగులకు డీఏ ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

3నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

రెవెన్యూ సేవలను సరళతరం చేయడం, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. ఈనెల 3వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. రెవెన్యూ సదస్సుల వివరాలను ముందుగానే ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో నిర్వహించే సదస్సులకు ఒక రోజు ముందే టాంటాం ద్వారా ప్రచారం చేయనున్నారు. రెవెన్యూ సదస్సులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహిస్తారు. ప్రతీ రోజు సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో ఆ రోజు వచ్చిన దరఖాస్తులపై చర్చిస్తారు. దరఖాస్తుల డేటా కోసం ప్రత్యేకంగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ప్రతీ మండలంలో రెండు బృందాలుగా ఏర్పడి ఒక బృందానికి తహసీల్దార్‌, మరో బృందానికి నాయబ్‌ తహసీల్దార్‌ నాయకత్వం వహిస్తారు. బృందంలో ఆర్‌ఐ, సర్వేయర్‌, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉండనున్నారు. దరఖాస్తు స్వీకరించిన తర్వాత దరఖాస్తుదారులకు రసీదు ఇవ్వడంతో పాటు దరఖాస్తులను ఆయా కేటగిరీల వారీగా విభజిస్తారు.

రైతులకు ఫౌండేషన్‌ సీడ్‌ పంపిణీ

రెవెన్యూ గ్రామాల్లో ఎంపిక చేసిన ముగ్గురు రైతులకు సోమవారం జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఫౌండేషన్‌ సీడ్‌ పంపిణీ చేయనున్నారు. అందుకు సంబంఽధించి వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రెవెన్యూ గ్రామాల్లో ముగ్గురు రైతుల చొప్పున ఎంపిక చేశారు. వరికి సంబంధించి రెండు కిట్లు, పెసర్లు ఒక కిట్‌ పంపిణీ చేస్తారు. నల్లగొండ జిల్లాలో 33 మండలాల్లో 140 క్లస్టర్లను ఎంపిక చేయగా, అందులో 564 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 564 గ్రామాలకు మొత్తం 1,692 కిట్లను పంపిణీ చేస్తారు. వీటిలో వరి విత్తనాల కిట్స్‌ 1128 ఉండగా, పెసర్లు 564 కిట్లు ఉన్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసి విత్తన ఉత్పత్తిని సాధించడం కోసం ఫౌండేషన్‌ సీడ్‌ను పంపిణీ చేస్తున్నారు. మూడు జిల్లాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా విడుదలైంది. యాదాద్రి జిల్లాలో పంట నష్టపోయిన 1,385 ఎకరాలకు 1,029 మంది రైతులకు రూ.1,38,56,000 పరిహారం చెల్లించనున్నారు. సూర్యాపేట జిల్లాలో 1,104 ఎకరాలకు సంబంధించి 662మంది రైతులకు రూ.1,10,41,750 వారి ఖాతాలో జమ చేయనున్నారు. నల్లగొండ జిల్లాలో 726 ఎకరాలకు సంబంధించి 679మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.72.69లక్షలు మంజూరు కాగా, వీటిని ప్రభుత్వం విడుదల చేసింది.

ఆవిర్భావ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు

యాదాద్రి, జూన్‌1 (ఆంధ్రజ్యో తి): రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పా ట్లు పూర్తి చేసింది. కలెక్టరేట్‌, ఆర్డీవో, తహసీల్దార్‌, ఎంపీడీవో, ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్‌ ఆవరణలో పోలీ్‌సపరేడ్‌, వేదిక, జెండా ఆవిష్కరణకు ముస్తాబు చేశారు. కలెక్టరేట్‌ ఆవరణలో పలుశాఖల ఆధ్వరంలో నిర్వహించే స్టాళ్ల కోసం అధికారులు ఏరాట్లు చేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోమవారం ఉదయం 9గంటలకు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, 9.15గంటలకు కలెక్టరేట్‌ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్ర ఆవతరణ దినోత్సవ సందేశాన్ని ఇస్తారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాలు, బెలూన్లను ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు. జ్ఞాపికలను, ప్రశంసాపత్రాలను అందజేస్తారు. ఈ కార్యక్రమాల్లో జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

ఫ భువనగిరి టౌన్‌: పెద్దచెరువు కట్టపై భారీ దిమ్మెపై జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు మునిసిపల్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Updated Date - Jun 02 , 2025 | 12:59 AM