Share News

అట్రాసిటీ కేసులో జైలు శిక్ష, జరిమాన

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:36 AM

అట్రాసిటీ కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

అట్రాసిటీ కేసులో జైలు శిక్ష, జరిమాన

అడ్డగూడూరు, ఏప్రిల్‌ 10( ఆంధ్రజ్యోతి): అట్రాసిటీ కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అడ్డగూడూరు పోలీస్‌ స్టేషనలో 2019 సంవత్సరంలో ఎస్సీ అట్రాసీటీ కేసు నమోదు కాగా గురువారం నల్లగొండ ఎస్సీ అట్రాసిటీ స్పెషల్‌ కోర్టులో విచారణంలో భాగంగా నిం దుతులుగా ఉన్న అడ్డగూడూరు మండలంలోని కంచనపల్లి చెందిన కూక్కునూరు సురేందర్‌ రెడ్డి, బొడ్డుగూడెంకు చెందిన తీగల నర్సింహా రెడ్డికి ఎస్సీ అట్రాసీటీ కేసులో ఇద్దరు నిందితులకు 6నెలల జైలు శిక్ష తో పాటు రూ, 1000 జరిమానా విధిస్తున్నట్లు నల్లగోండ కోర్టు తీర్పును వెలువడించినట్లు ఎస్‌.ఐ నాగరాజు తెలిపారు.

Updated Date - Apr 11 , 2025 | 12:36 AM