కొత్త వారికి అవకాశమేదీ?
ABN , Publish Date - Jul 22 , 2025 | 12:49 AM
కులవృత్తులకు సహకారం అందించడంలో భాగం గా గత ప్రభుత్వం నాయీబ్రాహ్మణులు, రజక వృత్తిదారుల దుకాణాలకు ఉచిత విద్యుతను అమల్లోకి తెచ్చింది. 2021 ఏప్రిల్ 1 నుంచి ఉచి త విద్యుతను అందజేస్తోంది.
భానుపురి, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : కులవృత్తులకు సహకారం అందించడంలో భాగం గా గత ప్రభుత్వం నాయీబ్రాహ్మణులు, రజక వృత్తిదారుల దుకాణాలకు ఉచిత విద్యుతను అమల్లోకి తెచ్చింది. 2021 ఏప్రిల్ 1 నుంచి ఉచి త విద్యుతను అందజేస్తోంది. ప్రతి నెలా 250 యూనిట్ల వరకు సుమారు రూ.2200 విలువై న ఉచిత విద్యుతను అందిస్తున్నారు. జిల్లాలో 650 నాయీబ్రాహ్మణ దుకాణాలకు ఉచిత విద్యుత అందుతోంది. అయితే కొత్తగా దుకాణా లు ఏర్పాటుచేసిన వారు మీ సేవా కేంద్రాలకు వెళితే నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వ సైట్ ఓపెన కావడం లేదని, దరఖాస్తుకు కూడా అ వకాశం లేదని మీ సేవా నిర్వాహకులు తెలుపుతున్నారని సెలూన్ల యజమానులు వాపోతున్నారు. దీంతో కొన్ని నెలలుగా ఉచిత విద్యుత పథకం వర్తించక వేల రూపాయల విద్యుత బిల్లులు చెల్లిస్తున్నారు. ఇదేమని విద్యుత అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని, ప్రభుత్వమే సైట్ ఓపెన చేయాలని చెబుతున్నట్లు దుకాణా యజమానులు చెబుతున్నారు. ఏడాదిన్నర సైట్ ఓపెన కావాడం లేదని చెబుతున్నారని, ప్రతి నెలా వేలాది రూపాయల ఉచిత విద్యుతను కోల్పోవాల్సి వస్తోందంటున్నారు. వచ్చే కొద్దిపాటి ఆదాయంలో విద్యుత బిల్లులకే రూ.2 వేలు పోతుందని వాపోతున్నారు. ఇకనైనా తమకు ఉచిత విద్యుత ఇచ్చి ఆదుకోవాలంటున్నారు.
దుకాణం పెట్టుకుని ఎనిమిది నెలలైంది
సూర్యాపేటలోని కొత్తబస్టాండ్ సమీపంలో హెయి ర్ సెలూన దుకాణం పెట్టుకుని ఎనిమిది నెల లు అవుతోంది. ఉచిత కరెంట్ పథకం వర్తింపు కోస మీసేవా కేంద్రానికి వెళఙ్ల అడిగా. సైట్ ఓపెన కావడం లేదని చెబుతున్నారు. నాలాం టి వారు సూర్యాపేటలో 30 మంది వరకు కొత్తగా హెయిర్ సెలూన్లు పెట్టుకున్నాం. ఉచి త విద్యుతను వర్తింపజేయాలి.
- జనగామ హరీష్, హెయిర్‌సెలూన యజమాని, సూర్యాపేట
650 సర్వీసులకు ఉచిత పథకం వర్తిస్తోంది
గత ప్రభుత్వంలో జిల్లాలో 650 హెయిర్ సెలూన దుకాణాలకు 250 యూనిట్లు ఉచితంగా విద్యుతను వాడుకునేలా మీటర్లను బిగించాం. కొత్త వారికి అవకాశం లేదు. ప్రభుత్వం నుంచి కొత్త సైట్ వస్తేనే ఇవ్వగలుగుతాం.
ప్రాంక్లిన, ఎస్‌ఈ, సూర్యాపేట విద్యుత శాఖ