తాగేది శుద్ధ జలమేనా?
ABN , Publish Date - Apr 26 , 2025 | 01:03 AM
వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో ప్రజలకు తాగునీటి అవసరాలు విపరీతంగా పెరిగాయి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు నీటిని వ్యాపారంగా చేస్తూ ఇష్టానుసారంగా ప్రజలను దోపిడీ చేస్తున్నారు.
పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు
ఫిల్టర్లపై అజమాయిషీ ఏదీ?
తనిఖీలు ఎరుగని అధికారులు
భువనగిరి (కలెక్టరేట్), ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి) : వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో ప్రజలకు తాగునీటి అవసరాలు విపరీతంగా పెరిగాయి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు నీటిని వ్యాపారంగా చేస్తూ ఇష్టానుసారంగా ప్రజలను దోపిడీ చేస్తున్నారు. పేరుకే ఫిల్టర్ వాటర్ అని చెబుతూ నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవడంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా పలు మండలాలు, గ్రామాల్లో వాటర్ ప్లాంట్ల ద్వారా తాగునీటి విక్రయాలు జరుగుతున్నాయి. తాగునీటి బోర్లు, మిషన భగీరధ ద్వారా సరఫరా అవుతున్న నీటిని చాలా వరకు ప్రజలు తాగడం లేదు. ఆర్వో వాటర్‌లో వివిధ రసాయనాలను కలపడం వలన చాలాకాలంగా వాటినే తాగుతున్నారు. నదుల ద్వారా వచ్చే నీటిని శుభ్రం చేసిన నీరు తాగడానికి ప్రజలు ఇష్టపడటం లేదు. దీంతో పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇలా..
జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలు, 17 మండలాలు 428 గ్రామ పం చాయితీలలో కలిసి మూడంకెలు దాటిన వాటర్ ప్లాంట్లు వెలిశాయి. వీటిలో ఎక్కువ శాతం అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోం ది. గ్రామ పంచాయితీల నుంచి కనీసం వృత్తి వ్యాపార లైసెన్సులు సై తం తీసుకోకుండా వ్యాపారం చేస్తున్నారని తెలుస్తోంది. ఇవే కాకుండా పలు కంపెనీలకు చెందిన ప్యాకేజ్‌డ్ డ్రింకింగ్ ఆర్‌వో ప్లాం ట్లు జిల్లా లో నడుస్తున్నాయి. 20 లీటర్ల నీటికి రూ.10నుంచి ట్యాంకర్లు ఆటోల ద్వారా అయితే రూ. 15, 20 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
నిర్వహణన సరిగానే ఉందా?
జిల్లాలో ప్రజల తాగునీటి వినియోగం అధికంగా ఉండటంతో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు అధికంగా రసాయనాలను కలుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. రివర్స్ ఆస్మోసిస్ ( ఆర్వో ) పద్దతిలో నీటిని ఫిల్టర్ చేయాలంటే అర్హులైన టెక్నీషియన ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఏ ప్లాంటులలో కూడా టెక్నీషియన్లు ఉండకుండా నిర్వాహకులే నడుపుతున్నారు. ఆర్‌వో ప్లాంట్ల నిర్వాహకులకు ఏ విధమైన లవణ మిశ్రమాలు ఎంతెంత మేరకు కలపాలనే విషయంపై కూడా వారికి స్పష్టత లేకపోవడంతో బోరుబావి ద్వారా వచ్చిన నీటిలో కొద్దిమేర రసాయనాలు కలిపి, శుద్ధి అయినట్లుగా విక్రయిస్తున్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వాటర్ ఫిల్టర్ల నీరు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నా అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
మిషన భగీరఽథ నీరే సురక్షితం
నదుల ద్వారా వచ్చే స్వచ్ఛమైన నీటికి అవసరమైన ట్రీట్‌మెంట్ చేసి మిషన భగీరఽథ నీటిగా అందిస్తున్నాం. మిషన భగీరఽథ నీరు పూర్తిగా సురక్షితమైనది. ప్రైవేటు కేంద్రాలు విక్రయించే తాగునీటిలో ఖనిజ లవణాలు ఉండవు. వాటర్ ప్లాంట్ల నీటిలో టోటల్ డీజాల్వ్ సాల్ల్స్( టీడీఎస్ ) 150 పాయింట్లు ఉంటే మిషన భగీరఽథ నీటిలో 300 పాయింట్లకు పైగా ఉంటాయి. ప్రతీరోజు ఆర్‌వో వాటర్ తాగితే ఎముకలు క్షీణించి అనారోగ్యం బారిన పడటమే కాకుండా భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. వాటర్ ప్లాంట్ల నీటికి మిషన భగీరథ నీటికి బేధాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. మిషన భగీరథ నీరు తాగి ఆరోగ్యంగా ఉండండి..
-వై. క్రిష్ణయ్య, సూపరిండెంట్ ఇంజనీరు, మిషన భగీరఽథ