మూసీ తిప్పలు తప్పేదెన్నడో?
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:29 AM
బీబీనగర్-భూదానపోచంపల్లి రోడ్డు మార్గంలో రుద్రవెల్లి-జూలూరు గ్రామాల మధ్య మూసీపై బ్రిడ్జి పనుల ఎనిమిదేళ్లుగా సాగుతూనే ఉన్నాయి.
నత్తనడకన రుద్రవెల్లి- జూలూరు బ్రిడ్జి పనులు
నిధుల కొరతే అడ్డంకి
ఎనిమిదేళ్లుగా పిల్లర్లకే పరిమితం
డీ-సాంక్షన దిశగా అడుగులు
హెచఎండీఏ నిధులతో కొత్త అనుమతులకు ప్రతిపాదన
(ఆంధ్రజ్యోతి,బీబీనగర్) : బీబీనగర్-భూదానపోచంపల్లి రోడ్డు మార్గంలో రుద్రవెల్లి-జూలూరు గ్రామాల మధ్య మూసీపై బ్రిడ్జి పనుల ఎనిమిదేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. పిల్లర్ల దశ నుంచి నేటికీ ఒక్క అడుగు ముందుకు పడటంలేదు. బ్రిడ్జి పనులు నిలిచిపోవడానికి నిధుల కొరతే ప్రధాన అడ్డంకిగా ఉంది. ఈబ్రిడ్జి పనులకు రెండోసారి టెండర్లు పిలవగా, దీన్నిదక్కించుకు న్న కాకతీయ కనస్ట్రక్షన్స సంస్థ 2024 లో పనులను ప్రారంభించింది. సుమారు రెండు నెల లపాటు రూ.35లక్షల విలువైన పనులు పూర్తి చేసినా ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాలేదు. ఏడాది తరువాత బిల్లులు చెల్లించినా, ఇలాగైతే పనులు నిర్వహించలేమని కాంట్రాక్ట్ సంస్థ తిరిగి పనులను వదిలేసింది. సుమారు 15నెలలుగా పనులు నిలిచిపోయాయి.
అప్పుడు.. ఇప్పుడు అదే తీరు
గత ప్రభుత్వ హయాంలో రుద్రవెల్లి-జూలూరు బ్రిడ్జి పనులు ప్రారంభం కాగా, నిధుల కొరత కారణం గా 2023 నుంచి ప్రభుత్వం మారే వరకు ఏడేళ్లపాటు పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా అదే పరిస్థితి నెలకొన్నది.
బీబీనగర్-భూదానపోచంపల్లి మండలాల పరిధిలో ని 30 గ్రామాల ప్రజల ఒత్తిడి మేరకు గత ప్రభుత్వ హయాలంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రుద్రవెల్లి-జూలూరు మార్గంలో మూసీపై బ్రిడ్జి నిర్మాణానికి సంబంధిత అధికారులతో అంచనాలు రూపొందించి గత ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 2014లో రోడ్డు విస్తరణకు రూ.22కోట్లు మార్గమధ్యలో రుద్రవెల్లి-జూలూ రు మధ్య మూసీపై బ్రిడ్జి నిర్మాణానికి అదనంగా రూ.4.5కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులకు 2016, మార్చి 6న మంత్రి జగదీ్‌షరెడ్డి శంకుస్థాపన చేశారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తికాగా, బ్రిడ్జి కోసం సేకరించిన భూములకు పరిహారం ఇవ్వకుండా పనులు చేసేది లేదని రైతులు అడ్డుకోవడంతో పిల్లర్ల దశలో నిలిచింది. కొన్నాళ్ల తర్వాత పైళ్ల శేఖర్‌రెడ్డి చొరవచూపి రైతులకు పరిహారం ఇప్పించడంతో అడ్డంకు లు తొలగిపోయినా, ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపేశాడు. 2023 అసెం బ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడి గ్రామాల్లో పర్యటించినప్పుడు బ్రిడ్జి పనుల పూర్తికి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హామీ మేరకు రెండో సారి బ్రిడ్జి నిర్మాణానికి రూ.10.80కోట్లు మంజూరు చేయించారు. ఈ పనులు దక్కించుకున్న కాకతీయ కనస్ట్రక్షన్స కంపెనీ 2024 జూలైలో పనులు తిరిగి ప్రారంభించింది. రెండు నెలల్లో సుమారు రూ.35లక్షలకు పైగా విలువైన పనులు పూర్తికాగా, వీటికి సకాలంలో బిల్లులు చెల్లించలేదు. దీంతో ఈ సంస్థ తిరిగి పనులను నిలిపివేసింది.
డీ-సాంక్షన కోసం ప్రతిపాదన
బ్రిడ్జి పనులు దక్కించుకున్న నిర్మాణ సంస్థ పను లు నిలిపివేయడంతో డీ-సాంక్షన చేయాలని కోరుతూ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు తెలిపింది. సదరు కాంట్రాక్ట్ సంస్థకు పలుమార్లు అధికారులు నోటీసు జారీచేసినా స్పందన లేదు. దీంతో ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు డీ-సాంక్షన చేసి తిరిగి కొత్త అనుమతులు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఇప్ప టి వరకు ఎలాంటి నిర్ణయం రాలేదు. ఈ బ్రిడ్జి పను ల జాప్యానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారడం తో దీన్ని హెచఎండీఏ నిధులతో చేపట్టాలని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి యోచిస్తున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే సూచన మేరకు సంబంధిత అధికారులు పాత అనుమతులను రద్దు చేసి కొత్త అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
ఎమ్మెల్యే హామీ నిలబెట్టుకోవాలి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రిడ్జిని పూర్తి చేయిస్తానని ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఇప్పటికే మూసీ కి వరదలు పెరిగినప్పుడల్లా రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోయి రెండు మండలాల ప్రజ లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో పక్క వర ద తాకిడికి పాత బ్రిడ్జి దెబ్బతిని కూలే స్థితి లో ఉంది. ఒక వేళ కూలితే బీబీనగర్, పోచంపల్లి మండలాలకు రాకపోకలు నిలుస్తాయి. ఆ పరిస్థి తి రాకుండా ఎమ్మెల్యేనే ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
- నవీనకుమార్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు
బ్రిడ్జి పనులు ప్రారంభించకుంటే ఉద్యమిస్తాం
నెల రోజుల్లో బ్రిడ్జి పనులు ప్రారంభించకపోతే స్థానిక గ్రామాల ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బ్రిడ్జిని అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అనిల్‌కుమార్‌రెడ్డి దాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యారు. వెంటనే పనులు తిరిగి ప్రారంభించేలా ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి.
- పిట్టల అశోక్, బీఆర్‌ఎస్ జిల్లా నేత