Share News

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలు

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:32 AM

ఇం దిరమ్మ ఇళ్ల పేరిట కాంగ్రెస్‌ నాయకులు అక్రమాలకు తెరలేపాలని నకిరేకల్‌ మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. సోమవారం రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో పార్టీ కార్యకర్తను పరామర్శించిన అనంతరం పల్లివాడ గ్రామంలో ఆయన మా ట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ఒక్క పథకం అమలుచేసింది లేదని, ఒక్క ప్రాజెక్టు కట్టిందీ లేదన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలు

ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య

రామన్నపేట, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : ఇం దిరమ్మ ఇళ్ల పేరిట కాంగ్రెస్‌ నాయకులు అక్రమాలకు తెరలేపాలని నకిరేకల్‌ మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. సోమవారం రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో పార్టీ కార్యకర్తను పరామర్శించిన అనంతరం పల్లివాడ గ్రామంలో ఆయన మా ట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ఒక్క పథకం అమలుచేసింది లేదని, ఒక్క ప్రాజెక్టు కట్టిందీ లేదన్నారు. కానీ నెలకు ఏకంగా రూ.10వేల కోట్లు అప్పులు చేస్తూ రేవంత్‌రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల పేరిట కాంగ్రెస్‌ నాయకులు చేతివాటం చూపిస్తున్నారని ఆరోపించారు. రైతుబంధు, రైతు బీమా ఆపేశారని చివరికి ఎరువులు కూడా లేకుండా చేసి రైతుల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేష్‌, నార్కట్‌పల్లి మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, చిట్యాల మా ర్కెట్‌ కమిటీ మాజీ వైస్‌చైర్మన్‌ కొండూరు శంక ర్‌, వలిగొండ మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌చైర్మన్‌ కంభంపాటి శ్రీనివాస్‌, శాపల్లి మాజీ సర్పంచ్‌ కర్నాటి ఉపేందర్‌, మునిపంపుల మాజీ ఎం పీటీసీ గాదె పారిజాత, జనంపల్లి మాజీ ఎంపీటీసీ వేమవరం సుధీర్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 12:32 AM