అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:54 AM
భువనగిరి రూరల్, ఏప్రిల్ 11(ఆంధ్ర జ్యోతి): గుట్టు చప్పుడు కాకు ండా హా షిష్ ఆయిల్ ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్ద రు అంత ర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేశారు

భువనగిరి రూరల్, ఏప్రిల్ 11(ఆంధ్ర జ్యోతి): గుట్టు చప్పుడు కాకు ండా హా షిష్ ఆయిల్ ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్ద రు అంత ర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేశారు. హైదరాబాద్ మల్కాజిగిరిలోని కమిష నరేట్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామానికి చెందిన పెట్లశేఖర్, అనిమిరెడ్డి దుర్గారావు స్నేహితు లు. వీరికి అదే జిల్లా గునుగుండ మండలం చెందిన గంజా దుర్గ కూడా స్నేహితుడు. అయితే దుర్గ వీరికి ఆంధ్ర ప్రదేశ్‌లోని తూని రైల్వేస్టేషన్ వద్ద వీరికి 4 కిలోల హాషిష్ ఆయిల్ (3ప్యాకెట్లు) అందజేసి హైదరాబాద్‌లో విక్ర యించాలని సూచించాడు. దీంతో వారు మూడు, నాలుగు రైళ్లు మారుతూ శుక్రవారం భువనగిరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని అనంతారం చౌరస్తా వద్ద ఓ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి అశిష్ ఆయిల్ ఉన్న బ్యాగును అక్కడ వదిలేసి పరుగెత్తారు. భువనగిరి రూరల్ ఎస్‌హెచ్‌వో సంతోష్‌కుమార్ అనుమానం వచ్చి బ్యాగును తెరిచి చూడగా అందులో హాషిష్ ఆయిల్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. 40 నుంచి 50 కిలోల గంజాయిని నుంచి కేజీ హాషిష్ ఆయిల్ తయారవుతుందని చెప్పారు. మొత్తం 4కిలోల హాషిష్ ఆయిల్ 200కిలోల గంజాయి వినియో గించినట్లు, రూ.80లక్షల విలువ ఉటుందని తెలిపారు. ఆయిల్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లను సీజ్ చేసినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. కాగా వీరికి హాషిష్ ఆయిల్ ను అందజేసిన గంజాదుర్గపై కూడ కేసు నమోదు చేశామని త్వరలో అతడి కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు. పెట్ల శేఖర్, అనిమిరెడ్డి దుర్గారావును భువనగిరి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. సమావేశంలో భువనగిరి డీసీపీ అక్షాంశ్ యాదవ్, ఎస్‌వోటీ అడిషినల్ డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు, రూరల్ ఎస్‌హెచ్‌వో సంతోష్‌కుమార్ ఉన్నారు.