మౌలిక వసతులు కల్పించాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:01 AM
మండలంలోని బీఎన్‌తిమ్మాపూర్ నిర్వాసితులకు కేటాయించిన స్థలంలో మౌలిక వసతులు కల్పించాలని భు వనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అన్నారు.
భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రెడ్డి
భువనగిరి రూరల్, జూలై 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని బీఎన్‌తిమ్మాపూర్ నిర్వాసితులకు కేటాయించిన స్థలంలో మౌలిక వసతులు కల్పించాలని భు వనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్ హనుమంతురావుతో కలిసి నిర్వాసితులకు కేటాయించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లో భాగంగా బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు భువనగిరి పట్టణశివారులో హుస్సేనాబాదలోని సర్వే నెం.107 లో 1067మంది నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింది ఇంటి స్థలాలు కేటాయించినట్లు తెలిపారు. తాగునీటి వసతి, డ్రైనేజీ, సీసీరోడ్డు నిర్మాణం త్వరగా చేపట్టాలన్నారు. నిర్వాసితులకు కావాల్సిన అన్ని సదుపాయాల కల్పన కు పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపాలిటీ తదితర శాఖలు సమష్టిగా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసితులంతా వెంటనే ఇళ్ల నిర్మాణా లు పూర్తిచేసుకోవాలన్నారు.బీయన్‌తిమ్మాపూర్‌కు సంబంధించి మరో రూ.150 కోట్ల పరిహారం అందించే విధంగా సీఎం, మంత్రుల దృష్టికి తీసుకవెళ్తామన్నా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి, ఆర్డీవో ఎం. కృష్ణారెడ్డి, తహసీల్దార్ ఎన్ అంజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ, ఎడ్ల సత్తిరెడ్డి, దర్శన్ రెడ్డి, ఉడుత ఆంజనేయులు, జిన్న మల్లేశం, జిన్న నర్సింహ, పిన్నం రాజు, తంగెళ్లపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్‌కుమార్, బర్రె జహంగీర్, పో తంశెట్టి వెంకటేశ్వర్లు, తాడూరి నర్సింహ, పిట్టల బాలరాజు, తోటకూర వెంకటేశ్ యాదవ్, మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్, డీఈలు పాల్గొన్నారు.