ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:52 PM
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం యా దగిరిగుట్టలోని ఆయా వార్డులలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్టరూరల్,జూలై 13(ఆంధ్రజ్యోతి):ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం యా దగిరిగుట్టలోని ఆయా వార్డులలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గానికి ఇప్పటివరకు 3500 ఇళ్లు మంజూరయ్యాయని, అన్ని ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇంటికి కావాల్సిన ఇ సుకతోపాటు సామగ్రి తక్కువ ధరకు ఇచ్చే విధంగా అధికారులు సం బంధిత యజమానులతో మాట్లాడాలని చెప్పారు. ఇసుక కొరత ఉంటే తహసీల్దార్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. ఉదయం 6గంటల నుంచి 10 గంటలవరకు పట్టణమంతా కలియదిరిగి, పట్టణ సమస్యలు అడిగి తె లుసుకున్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మిర్యాల లింగస్వా మి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, మాజీ కౌన్సిల ర్లు సీస విజయలక్ష్మీకృష్ణగౌడ్, ముక్కెర్ల మల్లేశ్, ఎరుకల హేమేందర్‌గౌడ్, గుట్ట పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాటబత్తిని ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతిగౌడ్,రమేష్, జీవన్‌రెడ్డి,శ్రీనివా్‌సరెడ్డి, నరేష్ పాల్గొన్నారు.