అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:38 AM
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మండలకేంద్రంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
గుండాల,ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మండలకేంద్రంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఆలేరు నియోజకవర్గంలో మొదటి విడత 3,700 ఇళ్లు మంజూరు చేశామని, మరో రెండు నెలల్లో 3,500 ఇళ్లు మంజూరు చేయిస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తిచేయాలన్నారు. ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న కుటుంబాలకు సిమెంటు బస్తాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇళ్లులేని పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ పథకం అమలు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీవో దేవేందర్‌రావు, హౌసింగ్ ఏఈలు కావ్య, ట్రాన్స్‌కో ఏఈ అంబాల నర్సింహులు, పీఏసీఎస్ చైర్మన్ లింగా ల భిక్షం, మాజీ ఎంపీపీలు ద్యాప కృష్ణారెడ్డి, సంగి వేణుగోపాల్ యాదవ్, హ రితదేవి, ఏలూరి రాంరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మండలంలోని కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలను పరిశీలించారు. కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు, మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి ఎమ్మెల్యేకు రాఖీ కట్టారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.