Share News

పెద్దల సభలో పెరిగిన ప్రాతినిధ్యం

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:23 AM

శాసనమండలిలో ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం పెరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గా తాజాగా నలుగురికి ఒకే సమయంలో అవకాశం దక్కడంతో ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీల సంఖ్య ఏడుకు చేరనుంది.

పెద్దల సభలో పెరిగిన ప్రాతినిధ్యం

మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి

కొత్తగా మరో నలుగురికి ఛాన్స్‌

వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లే

13న అధికారిక ప్రకటన

(ఆంధ్రజ్యోతిప్రతినిధి ,నల్లగొండ) శాసనమండలిలో ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం పెరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గా తాజాగా నలుగురికి ఒకే సమయంలో అవకాశం దక్కడంతో ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీల సంఖ్య ఏడుకు చేరనుంది. కొత్తగా సభ్యుల ఎన్నికను ఈనెల 13న అధికారికంగా ప్రకటించనుండగా, వీరి పదవీ కాలం ఈనెల 30నుంచి ప్రారంభమవుతుంది.

శాసనమండలిలో ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్‌ మల్లన్న,స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మంకెన కోటిరెడ్డి ఉన్నారు. తాజాగా, ఎన్నికయ్యే డాక్టర్‌ అద్దంకి దయాకర్‌ (కాంగ్రెస్‌), కేతావత్‌ శంకర్‌నాయక్‌ (కాంగ్రెస్‌), నెల్లికంటి సత్యం (సీపీఐ),దాసోజు శ్రవణ్‌కుమార్‌ (బీఆర్‌ఎ్‌స)తో కలిపి ఈ సంఖ్య ఏడుకు చేరనుంది. ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలి పునరుద్ధరణ తర్వాత ఈ స్థాయిలో ప్రాతినిధ్యం దక్కడం ఇదే తొలిసారి. గతంలో ఉమ్మ డి జిల్లా నుంచి ఒకే సందర్భంలో ఇద్దరు, ము గ్గురికి మించి ప్రాతినిధ్యం దక్కలేదు. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా పట్టుకొనసాగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా మండలిలో జిల్లా నుంచి ఒకేసారి నలుగురికి అవకాశం ఇప్పించుకోవడం ద్వారా ఉమ్మడి జిల్లా నేతలు పైచేయి సాధించారు. అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో కీలకనేతలు ప్రాతినిధ్యం వహిస్తు న్న నేపథ్యంలో జిల్లాకు అదే స్థాయిలో నిధులు సాధిస్తారని, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ సారించి ముందుకు నడిపిస్తారని ఉమ్మడి జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే కోటా నుంచే ఐదుగురికి చాన్స్‌

ఉమ్మడి జిల్లా నుంచి శాసనమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురిలో ఐదుగురు ఎమ్మెల్యే కోటా నుంచే ఎన్నికయ్యారు. మండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి 2019, ఆగస్టు 19న మొదటిసారి, 2021 నవంబరు 22న రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యా రు. 2019 సెప్టెంబరు 11 నుంచి మండలి చైర్మన్‌గా ఆయన కొనసాగుతున్నారు. స్థానిక సంస్థ ల కోటా నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన మంకెన కోటిరెడ్డి (బీఆర్‌ఎస్‌) 2022 జనవరి ఐదు నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తీన్మార్‌ మల్లన్న కాంగ్రెస్‌ అభ్యర్థిగా నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం స్థానం నుంచి గెలుపొంది, 2024 జూన్‌ 7 నుంచి ఎమ్మెల్సీగా బాధ్యతల్లో ఉన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఈనెల 30న పదవి ముగిసిన అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా ఉమ్మడి జిల్లాకు చెందినవారే. తాజాగా, జరిగిన ఈ నియోజకవర్గ ఎన్నికలో ఆయన ఓటమిపాలవడంతో మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కలేదు. అయితే ఎమ్మెల్యే కోటా నుంచి కాంగ్రెస్‌ నుంచి అద్దంకి దయాకర్‌, కేతావత్‌ శంకర్‌నాయక్‌, దాసోజు శ్రవణ్‌కుమార్‌, నెల్లికంటి సత్యానికి అవకాశం దక్కడంతో అనూహ్యంగా మండలిలో ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యం పెరిగినట్టయింది.

గతంలోనూ కీలకనేతలకే ఎమ్మెల్సీలుగా అవకాశాలు

శాసనమండలి పునరుద్ధరణ తర్వాత జిల్లా నుంచి మండలి సభ్యులుగా కీలక నేతలకే అవకాశాలు దక్కాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐతో కాంగ్రెస్‌ పొత్తు నేపథ్యంలో ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకు మండలి పునరుద్ధరణ జరిగిన వెంటనే 2017లో ఉమ్మడి జిల్లాకు చెందిన సీపీఎం నేత చెరుపల్లి సీతారాములుకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. బీఆర్‌ఎ్‌సలో కీలక నేతగా, రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన నాయిని నరసింహారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యేగా పనిచేసిన భారతీరాగ్యానాయక్‌, ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేసిన నేతి విద్యాసాగర్‌ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. కర్నె ప్రభాకర్‌, పూలరవీందర్‌, డాక్టర్‌ తేరా చిన్నపరెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహించారు.

ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం

వహిస్తున్న ఎమ్మెల్సీలు, పదవీకాలం

ఎమ్మెల్సీ పదవి ముగిసే తేదీ

తీన్మార్‌ మల్లన్న 29-3-2027

గుత్తా సుఖేందర్‌రెడ్డి 21-11-2027

మంకెన కోటిరెడ్డి 04-01-2028

డాక్టర్‌ అద్దంకి దయాకర్‌ 29-03-2029

దాసోజు శ్రవణ్‌కుమార్‌ 29-03-2029

కేతావత్‌ శంకర్‌నాయక్‌ 29-03-2029

నెల్లికంటి సత్యం 29-03-2029

Updated Date - Mar 12 , 2025 | 12:23 AM