మూసీకి పెరిగిన ఇన్‌ఫ్లో
ABN , Publish Date - May 26 , 2025 | 12:08 AM
కేతేపల్లి, మే 24 (ఆంధ్రజ్యోతి): ఎగువ నదీ పరీవాహక ప్రాంతా లు, హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది.
కేతేపల్లి, మే 24 (ఆంధ్రజ్యోతి): ఎగువ నదీ పరీవాహక ప్రాంతా లు, హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో ఇన్‌ఫ్లోతో నీటిమట్టం 637.30 అడుగులకు చేరింది. నెల రోజులకు పైగా ఐదారు వందల క్యూసెక్కులుగా నిలకడగా ఉంటున్న ఇన్‌ఫ్లో శనివారం 1,225 క్యూసెక్కులుగా నమోదైంది. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు ఎగువ మూసీ పరీవాహక గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు క్రమంగా దిగువన గల మూసీ ప్రాజెక్టుకు వచ్చి చేరుంది. దీంతో 645 అడుగులు (4.46 టీఎంసీలు) పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం గల మూసీ ప్రాజెక్టు నీటిమట్టం 637.30 అడుగులకు (2.63 టీఎంసీలు) చేరింది. వేసవిలోనే ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో ఆయకట్టు గ్రామాల రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వచ్చే 4,5 రోజులు ఇన్‌ఫ్లో ఇదే రీతి లో కొనసాగితే ప్రాజెక్టు నీటిమట్టం 640 అడుగులకు చేరడం ఖాయమని మూసీ యంత్రాంగం పేర్కొంటుంది. ఇప్పటికే జలకళను సంతరించుకున్న ప్రాజెక్టు ఖరీఫ్ సీజన్ ఆరంభంలో రుతుపవనాల ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలకు నిండి వానాకాలం సాగుకు నీరు అందుతుందని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.