Share News

దినసరి మిల్లు కూలీల కూలి రేట్లు పెంపు

ABN , Publish Date - Jun 25 , 2025 | 11:56 PM

మిర్యాలగూడ, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): దినసరి మిల్లు కూలీల కూలీ రేట్లు పెరిగినట్లు టీఎన్‌టీయూసీ అనుబంధ సంఘం మిర్యాలగూడ పార్‌బాయిల్డ్‌ మోడ్రన్‌రై్‌స, ఆయిల్‌ అండ్‌ దాల్‌ మిల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర అంజిబాబు యాదవ్‌ తెలి పారు.

 దినసరి మిల్లు కూలీల కూలి రేట్లు పెంపు

మిర్యాలగూడ, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): దినసరి మిల్లు కూలీల కూలీ రేట్లు పెరిగినట్లు టీఎన్‌టీయూసీ అనుబంధ సంఘం మిర్యాలగూడ పార్‌బాయిల్డ్‌ మోడ్రన్‌రై్‌స, ఆయిల్‌ అండ్‌ దాల్‌ మిల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర అంజిబాబు యాదవ్‌ తెలి పారు. మంగళవారం స్థానిక రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ భవన్‌లో మిల్లర్స్‌తో కార్మిక సంఘాలు నిర్వహించిన చర్చలు సఫలమైనట్లు తెలిపారు. గతంలో రోజువారి కూలి రూ.555 కాగా రూ.65కు పెంచి రోజుకు 620 చెల్లించనున్నట్లు చెప్పారు. సెలవురోజుల్లో పనిచేస్తే రోజు కూలీకి అదనంగా గతంలో రూ. 90 ఉండగా దానిని వందకు పెంచినట్లు పే ర్కొన్నారు వార్షిక బోన స్‌ గతంలో రూ.2000 ఉం డగా ప్రస్తుతం రూ.2,300కు పెంచడానికి మిల్లర్లు అంగీకరించారని తెలిపారు. సమావేశంలో మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్‌, బాబ్జి, కార్మిక నాయకులు వెంకటేశ్వరావు, వెంకన్న, పిచ్చయ్య, కనకయ్య, సుమన్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 11:56 PM