Share News

పంట ఎన్ని రోజులకు చేతికొస్తుంది?

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:05 AM

ఎన్ని రోజులు నీటి సరఫరా చేస్తే పంట చేతికి వస్తుందని ఎస్సారెస్పీ కాల్వ పరిధిలోని రైతులను కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌ ఆరా తీశారు.

పంట ఎన్ని రోజులకు చేతికొస్తుంది?
రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌పవార్‌

పెనపహాడ్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఎన్ని రోజులు నీటి సరఫరా చేస్తే పంట చేతికి వస్తుందని ఎస్సారెస్పీ కాల్వ పరిధిలోని రైతులను కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌ ఆరా తీశారు. మంగళవారం మండలంలోని మేఘ్యాతండా, భక్తాళాపురం, ధర్మాపురం గ్రామాల్లో ఎండిపోయిన పొలాలను, ఎస్సారెస్పీ కాల్వల్లో తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు భూక్యా క్రాంతి పొలంలోకి దిగి వరి పంటను పరిశీలించారు. బోరు బావుల ద్వారా వరిపొలం ఎంత సాగు చేయవచ్చునని కలెక్టర్‌ అడిగారు. రైతులు ఆంగోతు నర్సింగ్‌నాయక్‌ ఆంగోతు కృష్ణ, ఆంగోతు లక్ష్మీ, ఆంగోత చిన్ని, ఆంగోతు రామదాసులతో మాట్లాడారు. బోరు బావుల్లో నీరు అడుగంటిపోయాయని ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ఇంకా 20 రోజులు నీరు వస్తే ఆయకట్టు చివరి పొలాలు చేతికొచ్చే పరిస్థితి ఉందని రైతులు కలెక్టర్‌తో తెలిపారు. దీంతో పాటు బోర్లు, బావులో నీటి జలాలు వచ్చి తాగునీటి కూడా సమస్య పరిష్కారం అవుతుందని కలెక్టర్‌తో రైతులు విన్నవించుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ధరావత లాలునాయక్‌, ఇరిగేషన ఏఈ. లింగయ్య, ఏవో అనిల్‌నాయక్‌, ఆర్‌.ఐ రంజితరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 12:05 AM