ఐఐహెచ్‌టీ కోర్సులు సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - May 17 , 2025 | 12:19 AM
భూదాన్‌పోచంపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)లో నిర్వహిస్తున్న కోర్సులను సద్వినియో గం చేసుకోవాలని చేనేత, జౌళీ శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ కోరారు.
భూదాన్‌పోచంపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)లో నిర్వహిస్తున్న కోర్సులను సద్వినియో గం చేసుకోవాలని చేనేత, జౌళీ శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ కోరారు. భూదాన్‌పోచంపల్లిలో శుక్రవారం చేనేత కార్మికులకు, చేనేత పద్మశాలి సంఘాల నాయ కు లకు ఐఐహెచ్‌టీలో నిర్వహించే డీహెచ్‌టీటీ కోర్సుపై నిర్వహించే అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ (డీహెచ్‌టీటీ)పై 3 ఏళ్లు (6సెమిస్టర్ల ప్రోగ్రాం) అందించే కోర్సుకు ఈ విద్యాసంవత్సరం 2025-26కు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కోర్సుకు కనీస విద్యార్హత ఎస్‌ఎ్‌ససీ ఉత్తీర్ణత (మెరిట్ ఆధారంగా) జనరల్ అభ్యర్థులకు 15- 23 ఏళ్లు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 15-25 ఏళ్ల మధ్య వయస్సు గల వారు అర్హులని తెలిపారు. లాటరల్ ఎంట్రీ (డైరెక్ట్ 2వసంవత్సరం) కోర్సు కు ఇంటర్మీడియట్ (ఎంపీసీ/ ఒకేషనల్)లో ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. జనరల్ అభ్య ర్థులు 17-23 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 17-25 ఏళ్ల మధ్య వయస్సు గల వారు అర్హులని తెలిపారు. కోర్సు ఫీజు, పుస్తకాలు, పరీక్ష ఫీజులతో సహా సంవత్సరానికి రూ. 6వేలు ఖ ర్చు అవుతుందని వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో 60 మందికి ప్రవేశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కోర్సు మొ త్తం కాలానికి అన్ని విద్యార్థులకు నెలకు రూ. 2,500 చొప్పున స్టైఫండ్, ప్రతి ఏడాది రెం డు ఉచిత యూనిఫామ్స్ అందిస్తుందన్నారు. భార త ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖలోని చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం ఎన్‌హెచ్‌డీపీ పథకం కింద చేనేత కుటుంబాలకు నెలకు రూ. 5వేల స్టైఫండ్ పొందవచ్చునని తెలిపారు. తల్లిదండ్రులు చెల్లుబాటు అయ్యే వీవర్స్ ఐడీ కార్డు(న్యూఢిల్లీలోని చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం జారీ చేసిన పెహ చాన్ కార్డు) కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. విశేష బోధనం అనుభవం కలిగిన అధ్యాపకులతో బోధన ఉంటుందని, కేంద్ర మౌలిక సదుపాయాలు, ప్రయోగశాల సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. 100 శాతం ఉద్యోగ అవకాశం ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, ఏడీవో, పర్సన్ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రెడ్డి, సంఘం మేనేజర్ రుద్ర ఆంజనేయులు, చేనేత అంకం పాండు, కార్యవర్గం సభ్యులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.