కొనాలంటే ‘చింతే’..
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:41 AM
చింతచిగురును ఇష్టపడని వారుండరు. సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే లభిస్తుంది. దీంతో పల్లె ప్రాంతాల్లోని మహిళలు చిగురు ను సేకరించి పట్ణణాల్లో ఇంటింటికీ తిరుగుతూ, కూరగాయల మార్కెట్లలో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం కిలోధర రూ.1000 నుంచి రూ.1500 విక్రయిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి- చండూరు)
చింతచిగురును ఇష్టపడని వారుండరు. సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే లభిస్తుంది. దీంతో పల్లె ప్రాంతాల్లోని మహిళలు చిగురు ను సేకరించి పట్ణణాల్లో ఇంటింటికీ తిరుగుతూ, కూరగాయల మార్కెట్లలో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం కిలోధర రూ.1000 నుంచి రూ.1500 విక్రయిస్తున్నారు. అయినా పట్టణ ప్రజలు కొనుగోలు చేయడానికి వెనకాడడం లేదు. చిగురును ఎండబెట్టి ఉంచితే ఎక్కువ కాలం వాడుకోవచ్చు. ఏడాది కాలంలో కేవలం జూన మాసంలో అధికంగా లభిస్తుంది. కొమ్మల చివర్లో ఉన్న చింతచిగురును తెంపడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంతో రుచికరమైన చింతచిగురులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.
ప్రయోజనాలివీ...
చింతచిగురులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన లాక్టోడివ్‌గా పని చేసి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.ఫైల్స్ ఉన్నవారికి దివ్య ఔషధం.
యాంటీయాక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని చెడు కొలస్ర్టాల్‌ను తగ్గించి, మంచి కొలస్ర్టాల్ పెంచుతుంది.
వణుకుడు జ్వరం తగ్గడానికి సీ విటమిన ఉంటుంది. కాబట్టి, చింతచిగురు వాడాలని నిఫుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ కారకాలు వైర్‌సతోపోరాడి వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది.
ఉడికించిన చింతచిగురు నోట్లో వేసుకుని పుక్కిలిస్తే గొంతు నొప్పి, వాపు తగ్గుతాయ ట.దీనిలోని ఔషధ గుణాలు నోటిలోని సమస్యలపై త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.
వేడి, మసాలాలు తినడం వల్ల వచ్చే నోటి ప గుళ్లు, పూతను చింతచిగురు తగ్గిస్తుంది.
గుండె జబ్బులు రాకుండా నియంత్రిస్తుంది. రక్తంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధ్ది చేసే గుణాలు చింతచిగురులో పుష్కలంగా ఉన్నాయి.8 కడుపులో నులిపురుగులు లేకుండా చేస్తుంది.
జీర్ణాశయ సంబంధ వ్యాధులకు బహుళ ప్రయోజనకారిగా పని చేస్తుంది.
చింతచిగురులో విటమిన సీ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధ్దిగా ఉంటాయి.
క్యాన్సర్‌ను అడ్డుకునే గుణం చిగురులో ఉంది.
తరచూ చిగురు తింటే ఎముకలు దృడంగా ఉంటాయి.
థైరాయిడ్, డయాబెటీస్ సమస్యతో బాధపడేవారికి చిగురు మేలు చేస్తుంది.