బిల్లులు చెల్లించకుంటే కలెక్టరేట్ ముట్టడి
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:39 AM
పాడి రైతులకు మద ర్ డెయిరీ ఈ నెల 20లోగా ఆరు బిల్లులను చెల్లించకుంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి హెచ్చరించారు.
యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 11,(ఆంధ్రజ్యోతి): పాడి రైతులకు మద ర్ డెయిరీ ఈ నెల 20లోగా ఆరు బిల్లులను చెల్లించకుంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. మదర్ డెయిరీ డైరెక్టర్లు కస్తూరి పాండు, కందాల అలివేలురంగారెడ్డి, మా జీ డైరెక్టర్లు దొంతిరి సోమిరెడ్డి, ఒగ్గు భిక్షపతిలతో కలిసి సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దా ణా, పశుగ్రాసం ధరలు పెరిగి, పాల సేకరణ ధరలు తగ్గాయన్నారు. బిల్లు రాకపోవడంతో పెట్టుబడి కోసం పాడి రైతులు అప్పులు చేస్తున్నారన్నారు. తమ ప్యానల్‌ను గెలిపిస్తే మదర్ డెయిరీకి రూ.30కోట్లు బోనస్ ఇస్తానని ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందన్నారు. చైర్మన్‌గా గుడిపాటి మధుసూదన్‌రెడ్డి గెలిచినా హామీలు నెరవేర్చకుండా పారిపోయారన్నారు. మదర్ డెయిరీని దివాళా తీయించారని ఆరోపించారు. డెయిరీకి ఉన్న ఆస్తులను అమ్మడం కాదని, ఆస్తులను అభివృద్ధి చేస్తూ పాడి రైతులను కాపాడాలన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అ యిలయ్య మదర్ డెయిరీని ప్రైవేట్ సంస్థ అనడం సరికాదన్నారు. నేరుగా ప్రభుత్వం సాయం చేయడానికి అవకాశం ఉన్నా లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో పాల సంఘం చైర్మన్లు భాస్కర్‌గౌడ్, కొండల్‌రెడ్డి, పుప్పాల సిద్దులు, దడిగె మధు, సతీ్‌షరెడ్డి పాల్గొన్నారు.