పశుసంపద ఆరోగ్యంతోనే మానవుల ఆరోగ్యం
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:31 AM
రైతులు అన్నిరకాల జీవాల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలని, పశువులు ఆరోగ్యంగా ఉంటే మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారని పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ కిషనకుమార్ అన్నారు.
గరిడేపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : రైతులు అన్నిరకాల జీవాల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలని, పశువులు ఆరోగ్యంగా ఉంటే మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారని పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ కిషనకుమార్ అన్నారు. గురువారం మండలంలోని గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పశువుల యాజమాన్యంపై పాడిరైతులకు రెండురోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాడిపశువులపై రైతులు విచక్షణారహితంగా వాడుతున్న యాంటీ బయాటిక్స్ వినియోగాన్ని తగ్గించాలని, తక్కువ ధరలో దాణా తయారీ, పునరుత్పత్తి యాజమాన్యంతో పాల ఉత్పత్తి పెంచుకోవాలని సూచించారు. పాల ఉత్పత్తుల విలువను పెంచుకోవాలని పశువులు ఆరోగ్యంగా ఉండాలన్నారు. రైతులు అన్నిరకాల జీవాల ఆరోగ్య పరిరక్షణకు పాటు పడాలని సూచించారు. రైతులకు శాఖాపరమైన సబ్సిడీలు, ఇతర స్కీంల గురించి వివరించారు. కార్యక్రమంలో కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, ఇనచార్జి డీ.నరేష్, కేవీకే మామునూర్ శాస్త్రవేత్తలు డాక్టర్ అరుణజ్యోతి, డాక్టర్ సాయికిరణ్, గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్తలు ఎన.సుగంధి, జీహెచ.నరే్‌ష, ఏ.కిరణ్, పీ.అక్షిత, స్థానిక పశు వైద్యాధికారిణి జయసుధ, పాడి రైతులు పాల్గొన్నారు.