బురద దారిలో వెళ్లేదెలా
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:08 AM
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి క్రాస్‌రోడ్డు నుంచి అలుగునూరు గ్రామానికి వెళ్లే దారి అధ్వానంగా తయారైంది. గుంతలమయమైన దారి చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారుతోంది.
నూతనకల్, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి క్రాస్‌రోడ్డు నుంచి అలుగునూరు గ్రామానికి వెళ్లే దారి అధ్వానంగా తయారైంది. గుంతలమయమైన దారి చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారుతోంది. ఈ దారిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. శుక్రవారం అలుగునూరు నుంచి క్షతగాత్రులను ఆసుపత్రులకు చేర్చేందుకు వెళ్లిన 108 వాహనానికి తిప్పలు తప్పలేదు. గుంతలమయమైన రహదారిలో జారుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. రహదారిని బీటీ రోడ్డుగా మార్చాలని గ్రామస్థులు కోరారు.