Share News

సమస్యల కొండ తరిగేదెలా?

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:02 AM

ధరణిలో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్ర భుత్వం తెచ్చిన భూభారతి ఆర్వోఆర్‌ చట్టం 2025 రెవెన్యూ అధికారులకు మెడపై కత్తిలా వేలాడుతోంది.

  సమస్యల కొండ తరిగేదెలా?

ఫ గడువు సమీపిస్తున్న కొద్దీ

అధికారులపై పెరుగుతున్న ఒత్తిడి

(ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ)

ధరణిలో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్ర భుత్వం తెచ్చిన భూభారతి ఆర్వోఆర్‌ చట్టం 2025 రెవెన్యూ అధికారులకు మెడపై కత్తిలా వేలాడుతోంది. రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు తహసీల్దార్లు, ఆర్‌ఐలు, ఆపరేటర్లు పైళ్లతో కుస్తీ పట్టినప్పటికీ సమస్యల గుట్ట తరగడం లేదని వాపోతున్నారు. ఓ వైపు పని ఒత్తిడి మరోవైపు రోజురాత్రి సమయాల్లో కాన్ఫరెన్స్‌లు, ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తుడడంతో ఇంటికి చేరే సరికి అర్ధరాత్రి 12 దాటుతోందని లోలోపలే కుమిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 14 వరకు రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం గడువు విధించగా దరఖాస్తుల క్లియరెన్స్‌ పనులు ప్రారంభించి నెలరోజులు దాటినప్పటికీ సుమారు 500 దరఖాస్తులు మాత్రమే పూర్తిగా పరిష్కరించారు. మరో 30 వేలవరకు దరఖాస్తులు కొంతమేర పరిష్కారమైనట్లు తెలుస్తోంది. సెలవురోజుల్లో సైతం రెవెన్యూ అధికారులతో పనులు చేయిస్తున్నప్పటికీ ఆగస్టు 14 నాటికి మరో 20 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 90 శాతం పనులు పూర్తయ్యేనా అనే అనుమానాలు తలెత్తున్నాయి.

రెవెన్యూ సదస్సుల ద్వారా దరఖాస్తుల స్వీకరణ

గత నెల జూన్‌ 3-18 వ తేదీ వరకు 33 మండలాల్లోని గ్రా మాల్లో మొత్తం 564 రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజ ల వద్ద నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గ్రామ సదస్సులో ఇవ్వని వారి కోసం 20వ తేదీ వరకు కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించారు. 21 నుంచి సాదాబైనామాలు, ప్ర భుత్వ భూముల సమస్యలను పక్కకు పెట్టి మిగతా వాటికి 29 వరకు నోటీసులు జారీ చేశారు. పేరు, తండ్రిపేరు, లాంటి మొదటి పేజి కరక్షన్‌ చిన్న సమస్యలను వెంటవెంటనే క్లియర్‌ చేసినప్పటికి క్షేత్రస్థాయి పరిశీలన చేసి క్లియర్‌ చేయాల్సిన, రికార్డుల్లో భూమి ఎక్కువగా ఉండి అనుభవంలో తక్కువగా ఉండటం లాంటి క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం లభి ంచక తల పట్టుకుంటున్నామని ఆవేదన చెందుతున్నారు.

పనిభారంతో మానసిక ఒత్తిడి

పేరు, తండ్రిపేరు, లాంటి మొదటిపేజి కరక్షన్లు, ఆర్డీఓ లాగిన్‌లో తీర్చగలిగే సమస్యలు చాలా వరకు ఇప్పటికే క్లియర్‌ చేసినట్లు తెలుస్తోంది. క్లిష్టమైన సమస్యలు లాంటివి ఉదాహరణకు మొదటి వ్యక్తికి రెండు ఎకరాలు భూమి ఉంటే అతడి పాస్‌పుస్తకంపై ఎకరా 20 గుంటలే నమోదుకాగా ఎటువంటి లావాదేవీలు లేకుండానే రెండోవ్యక్తికి 20 గుంటలు అదనంగా ఎక్కింది. పహణీ లేకుండా రెండో వ్యక్తికి భూమి ఎలా వచ్చిందని నోటీసు ఇచ్చి సమాధానం పొందిన పిదపనే అతడి పేరున ఉన్న 20 గుంటలు తొలగించి మొదటి వ్యక్తి పేరున ఎక్కించాల్సి ఉంది. ఇలాంటి కేసుల్లో తొందరపడి చేస్తే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు తల పట్టుకుంటున్నారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమైనందున సర్వేయర్లతో కలిసి రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన సమయంలో బురద మడుల నుంచి, వర్షం కురుస్తున్న సమయంలో వెళ్లలేక అధికారులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు గంటల తరబడి వీడియో కాన్ఫరెన్స్‌లు, అర్ధరాత్రి వరకు ఫిజికల్‌ మీటింగ్‌లతో సతమతమవుతున్నారు. కనీసం 30శాతం సక్సెస్‌ రేట్‌ చూపాలని అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో బోరుమంటున్నారు. సమావేశాల్లో రెవెన్యూ ఉన్నతాధికారుల సమక్షంలో తహసీల్దార్లు కంటతడి పెట్టుకుంటున్నట్లు సమాచారం. అధికారుల సంతకం అయిన ఫైళ్లను వెం టనే స్కాన్‌ చేసేందుకు ఆపరేటర్లను సైతం అర్ధరాత్రివరకు కార్యాలయాల్లోనే ఉంచుతున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు వాపోతున్నారు.

జిల్లా వారీగా ద రఖాస్తులు..

నల్లగొండ జిల్లాలో మొత్తం 45,622 దరఖాస్తులు స్వీక రించగా 18 జూలై నాటికి జిల్లా వ్యాప్తంగా 393 దరఖా స్తులు క్లియర్‌కాగా 513 దరఖాస్తులను తిరస్కరించారు. సూర్యాపేట జిల్లాలో జూలై 24 నాటికి 47, 530 దరఖాస్తులు నమోదు కాగా 299 క్లియర్‌ కాగా 9 తిరస్కరించారు. 15,630 వరకు పార్షియల్‌గా పూర్తి చేసినట్లు, 15,935 వాటికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

Updated Date - Jul 25 , 2025 | 01:02 AM