Share News

నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో ఇంటి రిజిస్ర్టేషన్‌ ?

ABN , Publish Date - May 08 , 2025 | 12:37 AM

నార్కట్‌పల్లి, మే 7(ఆంధ్రజ్యోతి): నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి ఓ ఇం టిని రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని అక్కెనపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది.

నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో ఇంటి రిజిస్ర్టేషన్‌ ?

నార్కట్‌పల్లి, మే 7(ఆంధ్రజ్యోతి): నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి ఓ ఇం టిని రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని అక్కెనపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అక్కెనపల్లికి చెందిన మామిడి రాములుకు ఇదే గ్రామంలో ఓ ఇల్లు ఉంది. అతడికి భార్యాపిల్లలు లేరు. 2021లో రాములు చనిపోయాడు. ఈ సమయంలో మామిడి వెంకటమ్మ (తమ్ముడు కూతురు) హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించింది. అయితే రాములు మరణానంతరం అతడి పేరు మీద ఉన్న ఇంటిని రిజిస్ర్టేషన్‌ చేసుకునే విషయంలో వెంకటమ్మ, రామయ్య సోదరి పార్వతమ్మ మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో పరస్పరం అంగీకారానికి వచ్చేంత వరకు మరణ ధ్రువీకరణ పత్రం ఎవరికీ ఇవ్వొద్దని ఇరువురు గ్రామ పంచాయతీలో అప్పటి సర్పంచ్‌, కార్యదర్శికి విన్నవించారు. అనం తరం మామిడి పార్వతమ్మ రామయ్యకు సంబంధించిన నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని జతపర్చి నల్లగొండలో ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది.

ఈ విషయం తెలుసుకున్న వెంకటమ్మ పంచాయతీ కార్యదర్శిని నిలదీసింది. తాము మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని చెప్పడంతో అనుమానం వచ్చి ఈసీలో పరిశీలించింది. చేతిరాతతో కూడిన మరణ ధ్రువీకరణ పత్రం ఉండటంతో ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు వెంకటమ్మ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు నల్లగొండ డీఎల్‌పీవో వెంకటేశ్వర్లు మంగళవారం అక్కెనపల్లికి వచ్చి 2021 నుంచి ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శులను పిలిచి విచారించారు.

కలెక్టర్‌కు నివేదిక ఇస్తా

కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ చేశా. 2021లో ఇక్కడ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన వెంకన్న, జానకమ్మను పిలిచి మరణ ధ్రువీకరణ పత్రం జారీ విషయమై విచారించా. నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తా.

- వెంకటేశ్వర్లు, డీఎల్‌పీవో

Updated Date - May 08 , 2025 | 12:37 AM