పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:36 AM
మండలంలోని కొలనుపాక గ్రామంలో ఉన్న ఇళ్లు లేని నిరుపేదలందరికీ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ గృహాలు నిర్మించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆలేరు, మార్చి11(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొలనుపాక గ్రామంలో ఉన్న ఇళ్లు లేని నిరుపేదలందరికీ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ గృహాలు నిర్మించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇళ్లు లేని పేదలతో కలిసి సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించిన రెండు ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీపీఐ పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా ప్రయోజనం చేకూరలేదని వాపోయారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో స్పందించేందుకు తాము తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించామన్నారు. అనంతరం తహసీల్దార్ అంజిరెడ్డికి వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చౌడబోయినకనకయ్య, నాయకులు రవి, ప్రవీణ్, చౌడబోయిన పరుశురాములు, భవాని, సంపతి, కావలి మౌనిక, యాట ఉపేందర్ పాల్గొన్నారు.