రహదారులపైనే ధాన్యం రాశులు
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:28 AM
(ఆంధ్రజ్యోతి-అర్వపల్లి): కొనుగోలు కేంద్రాల్లో స్థలా ల కొరత కారణంగా రైతులు ధాన్యాన్ని రహదారులకు ఇరువైపులా ఆరబోస్తున్నారు. దీంతో ప్రమాదాలు సం భవిస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ రైతులు జాతీయ రహదారులు, మూలమలుపుల వద్ద ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. జాజిరెడ్డిగూడెం మండలం వేల్పుచర్ల గ్రామ స్టేజీ వద్ద ప్రమాదకరంగా ఉన్న మూలమలుపు వద్ద వరి ధాన్యం రాశు లు రైతులు పోశారు. దీంతో ఎదురెదురుగా వచ్చే వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. చివ్వెంల మండ లం ఐలాపురం వద్ద ఖమ్మం జాతీయ రహదారి వెంట ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్లపై ధాన్యం పోశారు. చిన్నపాటి వాహనాలు పోకుండా ధాన్యం పూర్తిగా రోడ్లపై పోయడంతో ప్రమాదకరంగా ఉంది. అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసే విధంగా చర్యలు తీసుకోవాలి.
ధాన్యం ఆరబోస్తే తొలిగిస్తాం
రోడ్ల వెంట ధాన్యం ఆరబోస్తే తొలగిస్తాం. ప్రమా దకర మూలమలుపుల వద్ద ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం ఆరబోయద్దు. మూలమలుపుల వద్ద ధాన్యం ఆరబెడితే పోలీసులతో చర్యలు తీసుకుంటాం.
-రామరాజు, 365 హైవే, జేఈ