Share News

బురిడీ కొట్టించబోయి..బుక్‌ అయ్యాడు

ABN , Publish Date - Jun 08 , 2025 | 12:23 AM

పోలీసులను బురిడీ కొట్టించబోయి ఓ కారు డ్రైవర్‌ అడ్డంగా బుక్‌ అయ్యాడు.

బురిడీ కొట్టించబోయి..బుక్‌ అయ్యాడు

మిర్యాలగూడ, జూన 7 (ఆంధ్రజ్యోతి): పోలీసులను బురిడీ కొట్టించబోయి ఓ కారు డ్రైవర్‌ అడ్డంగా బుక్‌ అయ్యాడు. పోలీసులకు చెందిన వాహనంగా చెప్పుకుంటూ ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స లేకుండానే ట్యాక్సీ నడుపుతున్న వ్యక్తిని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ పట్టుకుని ఛీటింగ్‌ కేసు నమోదుచేశారు. వివరాల్లోకి వెళితే ఈనెల 6 శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని వినుకొండకు ఏపీ27ఏపీ 6996 నెంబర్‌ గల ఇన్నోవా కారులో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ కుటుంబీకులు ప్రయాణిస్తున్నారు. ఆ వాహనాన్ని డ్రైవర్‌ శివంకర సాయిప్రసాద్‌ దామరచర్ల మండల కేంద్రం మీదుగా పోలీ్‌ససైరనతో వాహనాన్ని వేగంగా నడుపుతూ వెళ్తున్నాడు. అదే సమయంలో వాడపల్లి చెక్‌పోస్ట్‌ వైపు వెళ్తున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు వాహనం అదే రూట్‌లో ప్రయాణిస్తోంది. పోలీ్‌ససైరనతో వెళ్తున్న వాహనం ముందు వెనకా ఎస్కార్ట్‌ వాహనాలు లేకపోవడం, అదేపనిగా సైరన మోగిస్తూ వెళ్తుండటంతో అనుమానించిన డీఎస్పీ ఇన్నోవా కారును ఓవర్‌టేక్‌ చేసి ఆ వాహనాన్ని వాడపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద నిలిపివేశారు. డ్రైవర్‌ శివశంకర్‌ను పిలిచి వాహనం ఎవరిది, ఎక్కడకు వెళ్తుందని ఆరాతీశారు. వెంటనే డ్రైవర్‌ తడుముకోకుండా ఇది వినుకొండ ఎస్‌ఐ వెహికిల్‌, కారులో సీఐ ఫ్యామిలీ ప్రయాణిస్తుందని చెప్పినట్లు సమాచారం. అనంతరం అందులో ప్రయాణిస్తున్న వ్యక్తిని డీఎస్పీ పిలిపించి విచారించారు. తాను, పిల్లలు యూకేలో ఉంటున్నామన్నారు. వినుకొండలో సొంత ఇంటికి వెళ్లడం కోసం ట్యాక్సీ మాట్లాడమని కుటుంబీకులకు చెప్పడంతో రూ.11 వేలకు కిరాయి మాట్లాడి ఈ వాహనాన్ని ఎయిర్‌పోర్ట్‌కు పంపినట్లు తెలిపాడు.

డ్రైవర్‌ను తిరిగి పోలీ్‌సలు ప్రశ్నించగా వాహనానికి ఆర్‌సీ, అతడికి డ్రైవింగ్‌ లైసెన్స కూడా లేనట్లు తెలిసింది. వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరగంటలో మరో వాహనాన్ని రప్పించి ఇన్నోవాలో ప్రయాణిస్తున్న వారిని క్షేమంగా వినుకొండకు పంపించినట్లు తెలిసింది. అందుకు ఆ కుటుంబీకులు తెలంగాణ పోలీసులకు కృతజ్జతలు తెలిపినట్లు సమాచారం ఈ విషయమై వాడపల్లి ఎస్‌ఐ శ్రీకాంతరెడ్డి మాట్లాడుతూ ఇన్నోవా కారు డ్రైవర్‌ శివంకర సాయిప్రసాద్‌పై ఛీటింగ్‌ కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - Jun 08 , 2025 | 12:23 AM