ఫిర్యాదులను పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:26 AM
‘ప్రజావాణి’కి వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇచ్చి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ హనుమంతరావు
భువనగిరి (కలెక్టరేట్), జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజావాణి’కి వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇచ్చి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో 99 దరఖాస్తులను తీసుకొని మాట్లాడారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 54 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ‘ప్రజావాణి’ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, వన మహోత్సవంలో మొక్కలు నాటే లక్ష్యం సాధించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, జడ్పీ సీఈవో ఎన్.శోభారాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టీ.నాగిరెడ్డి, డీపీవో సునంద, తదితరులు పాల్గొన్నారు.
మహిళా శక్తితో దేశాభివృద్ధి
మహిళల ఆర్థిక పరిపుష్టితో దేశాభివృద్ధి సాధ్యమని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కల్పించే ఆర్థిక అక్షరాస్యతా కరదీపికను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మహిళా సంఘాల లీడర్లు, సభ్యులు ఆర్థికంగా శక్తివంతమయ్యేందుకు ఈ కరదీపిక ఉపయోగపడుతుందని, దీన్ని వినియోగించుకోవాలన్నారు.
ఫ (ఆంధ్రజ్యోతి, చౌటుప్పల్ టౌన్): చౌటుప్పల్ మునిసిపాలిటీలోని గోల్డెన్ ఫారెస్ట్ భూములను అక్రమంగా సాగు చేసుకుంటున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తాళ్లసింగారం గ్రామానికి చెందిన రైతులు సుర్వి నర్సింహగౌడ్, గుత్తా శ్రీధర్‌రెడ్డి, నల్ల అంజయ్య యాదవ్, మండారి మార్క్ ‘ప్రజావాణి’లో కలెక్టర్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు.
ఫ (ఆంధ్రజ్యోతి, భువనగిరి గంజ్, కలెక్టరేట్): భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల భూములు రెడ్‌క్రాస్ ఆస్పత్రికి కేటాయించవద్దని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా రెడ్‌క్రా్‌సకు భూమి కేటాయింపును నిలిపివేయాలని కళాశాల ప్రిన్సిపాల్ పాపిరెడ్డికి ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల శివ, లావుడియ రాజు వినతిపత్రం అందజేశారు.