Share News

వెంటనే ధాన్యం ఎగుమతి చేయాలి

ABN , Publish Date - May 17 , 2025 | 12:45 AM

కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే ఎగుమతి చేయాలని మండలంలోని లింగరాజుపల్లి గ్రామ రైతులు డిమాండ్‌ చేశారు. మండలంలోని లింగరాజుపల్లి గ్రా మంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం ఎగుమతి చేయాల ని కోరుతూ గ్రామానికి చెందిన పలువురు రైతులు శుక్రవారం మండలకేంద్రంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

వెంటనే ధాన్యం ఎగుమతి చేయాలి

ఆత్మకూరు(ఎం)లో రైతుల రాస్తారోకో

ఆత్మకూరు(ఎం), మే 16 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే ఎగుమతి చేయాలని మండలంలోని లింగరాజుపల్లి గ్రామ రైతులు డిమాండ్‌ చేశారు. మండలంలోని లింగరాజుపల్లి గ్రా మంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం ఎగుమతి చేయాల ని కోరుతూ గ్రామానికి చెందిన పలువురు రైతులు శుక్రవారం మండలకేంద్రంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు రావడంలేదని, దీంతో తూకం వేసిన బస్తాల నిల్వలు పేరుకుపోయినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ నాయకు లు రైతుల రాస్తారోకోకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు బీసు చందర్‌, యాస ఇంద్రారెడ్డి, కోరె భిక్షపతి, జి.కాశీనాథ్‌, బి.ఇంద్రారెడ్డి, టి.మల్లారెడ్డి, జి.దశరథ, ఎం.వెంకటేశం, ఎన్‌.రాజు, రైతులు వై.నర్సిరెడ్డి, కె. స్వామి, నాగరాజు, మల్లేష్‌, సోమిరెడ్డి, యాకుబ్‌రెడ్డి, పాల్గొన్నారు.

అసత్య ప్రచారం నమ్మొద్దు

లింగరాజుపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఎగుమతి కావడం లేదని కొందరు రైతులు అసత్యప్రచారం చేస్తున్నార ని, ఇది నమ్మొద్దని మోత్కూరు మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బొ డిగె నర్సింహ, కిసాన్‌ సెల్‌ మండల నాయకుడు ఎర్ర విఠల్‌రెడ్డి అన్నారు. హమాలీలు తక్కువగా ఉన్నా రోజుకు రెండు లారీల ధాన్యం ఎగుమతి అవుతుందన్నారు.

ధాన్యం ఎగుమతి త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్‌

ఆత్మకూరు(ఎం), మే16 (ఆంధ్రజ్యోతి): ధా న్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి సిద్ధంగా ఉన్న బస్తాలను త్వర గా ఎగుమతి చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు నిర్వాహకుల ను ఆదేశించారు. శుక్రవారం మండలంలో ని లింగరాజుపల్లి గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో ఎంత ధాన్యం నిల్వ ఉందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో సుమారు ఆరు లారీల ఽధాన్యం ఉందని, రెండు మూడు రోజుల్లో పూర్తిగా ధాన్యాన్ని ఎగుమతి చేస్తారని, రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. తహసీల్దార్‌ వి.లావ ణ్య, ఆర్‌ఐ మల్లికార్జున్‌రావు కలెక్టర్‌వెంట ఉన్నారు.

Updated Date - May 17 , 2025 | 12:45 AM