కారులో వచ్చి.. రైలుకు ఎదురు వెళ్లి
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:39 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు.
బీబీనగర్, భూదానపోచంపల్లి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రిభువనగిరి జిల్లా భూదానపో చంపల్లి మండలంలోని అంతమ్మగూడెం గ్రామానికి చెందిన వస్పరి వెంకటేశకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అభిలాష్(19) ఉన్నారు. అభిలాష్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం ఔషాపూర్ శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం కళాశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన అభిలాష్ రాత్రి 10గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. అందరూ పడుకున్న తర్వాత కారులో ఇంటి నుంచి బయలు దేరి బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్ పక్కన సర్వీస్ రోడ్డుపై కారును పార్కు చేసి బీబీనగర్ - ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మార్గమధ్యలో మనుగూరు ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దృశ్యాన్ని నేరుగా చూసిన రైలు లోకోపైలెట్ బీబీనగర్ స్టేషన మాస్టర్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయన వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. జీఆర్‌పీ ఇనచార్జి కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అభిలాష్ మృతితో స్వగ్రామం భూదానపో చంపల్లి మండలంలోని అంతమ్మగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.