ఇంటర్‌లో బాలికలదే పైచేయి
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:42 AM
ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్‌లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. మంగళవారం ఇంటర్ ప్రథ మ,ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల కాగా, ప్రథ మ సంవత్సరంలో జనరల్‌విభాగంలో నల్లగొండ జిల్లా లో బాలికలు 65.40శాతం, సూర్యాపేటజిల్లాలో బాలికలు 65.05 శాతం, యాదాద్రి జిల్లాలో బాలికలు 67. 31శాతంతో ప్రతిభ చాటారు.
ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ
(ఆంధ్రజ్యోతి, యాదాద్రి, నల్లగొండ, భానుపురి) : ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్‌లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. మంగళవారం ఇంటర్ ప్రథ మ,ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల కాగా, ప్రథ మ సంవత్సరంలో జనరల్‌విభాగంలో నల్లగొండ జిల్లా లో బాలికలు 65.40శాతం, సూర్యాపేటజిల్లాలో బాలికలు 65.05 శాతం, యాదాద్రి జిల్లాలో బాలికలు 67. 31శాతంతో ప్రతిభ చాటారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో నల్లగొండ జిల్లాలో బాలికలు 60. 97శాతం, సూర్యాపేట జిల్లాలో 75.05 శాతం, యా దాద్రి జిల్లాలో 76.41శాతంతో ఉత్తీర్ణత సాధించారు.
నల్లగొండ జిల్లాలో...
నల్లగొండ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో మొత్తం 11,694మంది పరీక్షలు రాయగా 6,781మంది (57.99శాతం) ఉత్తీర్ణులయ్యా రు. అందులో బాలురు 5,452మంది పరీక్షలు రాయ గా,2,699మంది (49.50శాతం) ఉత్తీర్ణులయ్యారు. బా లికల విభాగంలో 6,262మంది పరీక్షలు రాయగా, 4,082మంది (65.40శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో బాలికలే పైచేయి సాధించారు. ఒకేషన ల్ విభాగంలో 2,283మంది పరీక్షలు రాయగా 1,150 మంది (50.37శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలుర విభాగంలో 1,259మంది పరీక్షలు రాయగా 461మంది (36.62శాతం), బాలికల విభాగంలో 1,024మంది పరీక్షలు రాయగా 689మంది (67.29శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం ఏమాత్రం మెరుగుపడలేదు. ఫస్టియర్‌లో రాష్ట్రంలో 16 స్థానం, సెకండియర్ లో 19వ స్థానంలో నిలిచింది. అధ్యాపకులు, విద్యార్థులు సరైన దృష్టిసారించకపోవడంతో ఫలితా లు పడిపోయాయని పలువురు పేర్కొంటున్నారు. ద్వితీయ సంవత్స రం జనరల్ విభాగంలో 10,957 మంది పరీక్షలు రాయగా, 7,543మంది (68.84శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలుర విభాగంలో 5,006మంది పరీక్షలు రాయగా, 3052మంది (60.97శాతం), బాలిక ల విభాగంలో 5,951మంది పరీక్షలు రాయగా 4,491 మంది (75.47శాతం) ఉత్తీర్ణులయ్యారు. సెంకడియర్ జనరల్ విభాగంలో కూడా బాలికలే పైచేయి సాధించారు. ఒకేషనల్ విభాగంలో 2,035మంది పరీక్షలు రా యగా 1,417మంది(69.63శాతం) ఉత్తీర్ణులయ్యారు. అందులో బాలురు1,137మంది పరీక్షలు రాయగా 650 మంది(57.17శాతం), బాలికలు 898మంది పరీక్షలు రాయగా 767మంది (85.41శాతం) ఉత్తీర్ణులయ్యారు.
యాదాద్రి జిల్లాలో...
యాదాద్రి జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 58.54 శాతం, ద్వితీయ సంవత్సరంలో 67.92శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 6,208 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 3,634 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 5,330 మంది పరీక్ష రాయగా, 3,756మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలురు 48.88శాతం, బాలికలు 67.92శాతం, ద్వితీయ సంవత్సరంలో బాలురు 52.43శాతం, బాలికలు 72.33శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విభాగంలో మొత్తం 62.96శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ప్రథమ సంవత్సరంలో 58.54శాతం, ద్వితీయం లో 67.92శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ ప్రథమ సంవత్సరంలో 6,208 మంది విద్యార్థులకు 3,634మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 5,530మంది పరీక్ష రాయగా, 3,756మంది ఉత్తీర్ణత సాధించారు.
సూర్యాపేట జిల్లాలో...
సూర్యాపేట జిల్లాలో మొత్తం 75 కళాశాలలు ఉం డగా, 15,586 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. గత ఏడాదికంటె ఈ విద్యాసంవత్సరంలో 8.8 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగం లో 6,389 మంది పరీక్ష రాయగా, 3,613 మంది ఉత్తీర్ణ త సాధించారు. అందులో బాలురు 2,878 మంది పరీ క్ష రాయగా, 1,329 మంది (48.18శాతం), బాలికలు 3,511మంది పరీక్ష రాయగా, 2,284 మంది (65.05 శా తం) ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 49శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రస్తుతం 56.65శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 1,679 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 807 మంది ఉత్తీర్ణ సాధించారు. గత ఏడాది 39శాతం ఉత్తీర్ణత నమోదుకాగా, ఈ ఏడాది 49శాతం సాధించారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్ విభాగంలో 6,152 మంది పరీక్షకు హాజరుకాగా, 4133 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 2,801 మంది పరీక్ష రాయగా 1,618 మంది (57.77శాతం), బాలికలు 3,351 మంది పరీక్ష రాయగా 2,515 మంది (75.05 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో జిల్లాలో 67.18శాతం ఉత్తీర్ణత రాగా, గత ఏడాది 62శాతం కంటే 5శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్ విభాగంలో 1,366 మంది పరీక్ష రాయగా, 850 మంది (62.23 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 53శాతం కంటే 9శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదైంది. డీఐఈవో భానునాయక్ తెలిపారు.
నాలుగేళ్లుగా నల్లగొండ జిల్లాలో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత ఇలా..
సంవత్సరం ఫస్టియర్ సెకండియర్
హాజరు ఉత్తీర్ణత శాతం హాజరు ఉత్తీర్ణత శాతం
2020-21 16,240 9,805 61.00 16,061 10,964 68.00
2022-23 12,408 12,174 98.11 13,222 10,485 79.29
2023-24 11,555 6,610 57.02 11,474 7,854 68.45
2024-25 11,694 6,781 57.99 10,957 7,543 68.84