రుణాలు ఇప్పిస్తానంటూ ఘరానా మోసం
ABN , Publish Date - May 26 , 2025 | 12:06 AM
డిండి, మే 25 (ఆంధ్రజ్యోతి): రుణాలు ఇప్పిస్తానంటూ ఇద్దరి నుంచి చెక్కులు తీసుకుని వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.22 లక్షల నగదు విత డ్రా చేసిన యువకుడి భాగోతం నల్లగొండ జిల్లా డిండి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వాయిదా డబ్బులు చెల్లించాలని ఫోన రావడంతో వెలుగులోకి
డిండి, మే 25 (ఆంధ్రజ్యోతి): రుణాలు ఇప్పిస్తానంటూ ఇద్దరి నుంచి చెక్కులు తీసుకుని వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.22 లక్షల నగదు విత డ్రా చేసిన యువకుడి భాగోతం నల్లగొండ జిల్లా డిండి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. డిండి మండలం తవక్లాపూర్ గ్రామపంచాయ తీ పరిధిలోని హజ్యతండాకు చెందిన ఆంగోతు వెంకటేష్ ఏడో తరగతి చదివాడు. వ్యక్తిగత అవసరాలకు రుణం అవసరమైనవారు సంప్రదిస్తే వారి స్థిరాస్తులు తాక ట్టు పెట్టించి శ్రీరామ్ ఫైనాన్స నుంచి రుణాలు ఇప్పిస్తూ ఉంటాడు. తవక్లాపూర్‌కు చెందిన భయ్య శ్రీనయ్య తన భూమిలో చేపల చెరువు, కోళ్ల ఫాం పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో వెంకటే్‌షను ఆశ్రయించాడు. ఇందుకోసం శ్రీనయ్య తన పేరిట ఉన్న డిండి ఆంధ్రబ్యాంకు 2021లో జారీచేసిన 10చెక్కులు వెంకటే్‌షకు ఇచ్చాడు. అప్పటికే ఆంధ్రాబ్యాంకు యూనియన బ్యాంకులో విలీనంకాగా, ఆ చెక్కులు చెల్లవని శ్రీరామ్ ఫైనాన్స సంస్థ నిరాకరించింది. దీంతో వెంకటేష్ హైదరాబాద్‌లోని గాయత్రీ బ్యాంక్‌లో శ్రీనయ్య పేరిట ఖాగా తెరిపించి చెక్కు తీసుకున్నాడు. అప్పు ఇప్పించేందుకు శ్రీనయ్య నుంచి రూ.50వేల కమీషన తీసుకున్నాడు. తాకట్టు పెట్టిన ఆస్తిపై శ్రీరామ్ ఫైనాన్స రూ.18లక్షలు మాత్రమే రుణం ఇస్తుందని, కోటక్ మహీంద్ర బ్యాంక్‌లో ఇదే ఆస్తిపై రూ.35లక్షల వరకు అప్పు ఇప్పించగలనని శ్రీనయ్యను నమ్మించాడు. హైదరాబాద్‌లోని కొటాక్ మహీంద్రబ్యాంక్ చైతన్యపురి బ్రాంచ నుంచి జారీ అయిన రూ.35 లక్షల చెక్కును 2025వ సంవత్సరం మే 26వ తేదీన చెల్లుబాటు అయ్యేవిధంగా ముందు తేదీలతో చెక్ ఇచ్చాడు. మహేంద్ర బ్యాంక్ నుంచి రుణం మంజూరైందని, త్వరలో మీ ఖాతాలో నగదు జమ అవుతుందని ఓ వ్యక్తితో శ్రీనయ్యకు ఫోన చేయించాడు. చెక్కుపై ఇచ్చిన తేదీన నగదు జమ అవుతుందని శ్రీనయ్య ఎదురు చూస్తున్నాడు.
వాయిదా కట్టాలని ఫోన రావడంతో వెలుగులోకి
శ్రీరామ్ పైనాన్స నుంచి తీసుకున్న అప్పుకు వాయిదా (ఈఎంఐ) చెల్లించాలని శ్రీనయ్యకు ఫోన రావడంతో తన ఆస్తి పత్రాలు తాకట్టుపెట్టి రూ.17.53,222 రుణం తీసుకున్నట్లు విషయం వెలుగుచూసింది. శ్రీనయ్య ఆస్తిపత్రాలు శ్రీరామ్ ఫైనాన్సలో తాకట్టుపెట్టటంతో రూ.17,53,222 రుణం తీసుకోగా, సంబంధిత నగదు శ్రీనయ్య పేరిట ఉన్న డిండి యూనియన బ్యాంకు ఖాతాలో మార్చి 30వ తేదీన జమ అయినట్లు గుర్తించారు. శ్రీనయ్య వద్ద తీసుకున్న 10ఖాళీచెక్కులను ఉపయోగించి మార్చి 31వ తేదీన యూనియన బ్యాంకు కరస్పాండెంట్ సహకారంతో రూ. 15,28,220నగదును వెంకటేష్ తన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖా తాలకు బదలాయించాడు. యూనియన బ్యాం కులో శ్రీనయ్య పేరిట కొత్త ఏటీఎం కార్డుకు దరఖాస్తు చేసి పిన జనరేట్ చేసుకునేందుకు ఫోన తీసుకున్నాడు. అనంతరం ఏటీఎం ద్వారా రూ.25 వేలు, ఫోనపే ద్వారా రూ.2లక్షలు డ్రా చేశాడు.
మరో రైతు ఖాతా నుంచి
వీరబోయినపల్లిగ్రామపంచాయతీలోని శక్రుతండాకు చెందిన యువ రైతు ఖాతా నుంచి ఇదే తరహాలో చెక్కులు ఉపయోగించి రూ.4లక్షలు తన బంధువుల ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు
బాధితులు నిలదీయటంతో
తమ ఖాతాల నుంచి రూ.22లక్షల నగదును ఇతర ఖాతాల్లోకి బదిలీ చేయించటంపై బాధితులు వెంకటే్‌షను నిలదీయగా, తప్పు చేసిన ట్లు అంగీకరించి తిరిగి చెల్లించేలా లిఖిత పూర్వకంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం రూ.18లక్షలకు వెంకటే్‌షకు సంబ ంధించిన ఆస్తిని శ్రీనయ్య సోదరుడికి మార్టిగేజ్ చేయించాడు. యూనియన బ్యాంకులో విలీనం కాకముందే ఆంధ్రాబ్యాంకు జారీచేసిన చెక్కు లు చెల్లుబాటు కావని స్పష్టమైన ఆదేశాలున్నా బ్యాంక్ అధికారులు నిబంధనలకు విరుద్ధ్దంగా నగదు బదిలీ చేయడంపై బాధితులు అనుమా నం వ్యక్తంచేస్తున్నారు. ఖాతాదారుడు ఇచ్చిన చెక్కుతో రూ.2 లక్షలకుపైగా నగదు తీసుకుంటున్న సమయంలో ఇతర వ్యక్తులు వస్తే చెక్కు జారీచేసినవారికి సమాచారం ఇవ్వాల్సి ఉండగా, బ్యాంక్ అధికారులు అలా చేయకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. వెంకటేష్ ఘటనపై శ్రీరామ్ ఫైనాన్స ఉద్యోగులు మాట్లాడు తూ తాము ఎవరినీ రికవరీ ఏజెంట్‌గా నియమించుకోలేదని, వెంకటే్‌షకు శ్రీరామ పైనాన్సకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ ఘటనపై డిండి ఎస్‌ఐ రాజును వివరణ కోర గా తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఈ ఘటనపై బ్యాంక్ మేనేజర్ సురేంద్రబాబును వివరణ కోరగా వెంకటేష్ తమ బ్యాంకు కరస్పాండెంట్‌తో బ్యాంకుకు వచ్చారని, కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నారని చెప్పటంతో బంధువుల ఖాతాలోకి నగదు జమ చేసినట్లు తెలిపారు.