లింగ నిర్ధారణ పరీక్షలు నేరం
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:59 PM
నిబంధనలు అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.హనుమంతరావు హెచ్చరించారు. కలెక్టరేట్‌లో మంగళవారం లింగ నిర్ధారణ చట్టంపై జిల్లా అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కలెక్టర్ ఎం.హనుమంతరావు
భువనగిరి(కలెక్టరేట్),జూలై 1 (ఆంధ్రజ్యోతి): నిబంధనలు అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.హనుమంతరావు హెచ్చరించారు. కలెక్టరేట్‌లో మంగళవారం లింగ నిర్ధారణ చట్టంపై జిల్లా అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం నేరమని, జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. చట్ట విరుద్దం గా స్కానింగ్ చేసినట్లు నిరూపణ అయితే అనుమతు లు రద్దుచేసి జరిమానాతోపాటు క్రిమినల్ చర్యలు తీ సుకుంటామన్నారు. లింగ నిర్ధారణ ఫిర్యాదులకోసం టో ల్ ఫ్రీ నెం:8074261809కు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం డాక్టర్స్ డే కేక్ కట్‌చేసి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ఏ.భాస్కరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎం.మనోహర్,అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, డి ప్యూటీ డీఎంహెచ్‌వోలు యశోద, శిల్పిని తదితరులున్నారు.
మోటకొండూరు: మండల కేంద్రంలోని మహత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లోని కిచెన్‌ను పరిశీలించారు. నూతన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అం దించాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడగా వర్షం వచ్చినప్పుడు గదులు కురుస్తున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వాటికి వెంటనే మరమ్మతులు చేయిస్తానని, రోడ్డు సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ నాగదివ్య, ఎంపీడీవో జ్యోతి, ఎంపీవో చంద్రశేఖర్ ఉన్నారు.