Share News

స్వాతంత్య్ర సమరయోధుడు గుండు నరసయ్య మృతి

ABN , Publish Date - Jul 16 , 2025 | 12:38 AM

నల్లగొండ జిల్లా పెనపహాడ్‌ మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు, స్వాతంత్య్ర సమరయోధుడు గుండు నరసయ్య(102) మంగళవారం అనారోగ్యంతో మరణించారు.

 స్వాతంత్య్ర సమరయోధుడు గుండు నరసయ్య మృతి
నరసయ్య(ఫైల్‌ఫొటో)

పెనపహాడ్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా పెనపహాడ్‌ మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు, స్వాతంత్య్ర సమరయోధుడు గుండు నరసయ్య(102) మంగళవారం అనారోగ్యంతో మరణించారు. ఆయనకు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. నర్సయ్య గ్రామంలో పటేల్‌ పట్వారీగా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం అహర్నిషలు కృషి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. సూర్యాపేట మాజీ మునిసిపల్‌ చైర్మన జుట్టుకొండ సత్యనారాయణ, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురే్‌షరావులు నర్సయ్య మృతదేహం వద్ద నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. అదేవిధంగా నర్సయ్య అంత్యక్రియల్లో వివిధ పార్టీ నాయకులు బిట్టు ఇందిరావెంకన్న, కొండేటి లచ్చయ్య, కొండెటి పవనకుమార్‌, భూక్య శివనాయక్‌, భూక్య సందీ్‌పరాథోడ్‌, కొండేటి లచ్చయ్య, కొండేటి రజిని సుధాకర్‌, సముద్రాలు శ్రీనివా్‌సలు, సముద్రాల రాంబాబు, పత్తిపాక వేణుదర్‌, ఎర్రంశెట్టి రామలింగయ్య, బొలిశెట్టి సత్యం, కర్నాటి సైదులు, అజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 12:38 AM