పంచలోహ విగ్రహం విక్రయిస్తామని మోసం
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:32 AM
హుజూర్‌నగర్ , జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : పంచలోహ విగ్రహం పేరుతో మోసగించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హుజూర్‌నగర్ , జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : పంచలోహ విగ్రహం పేరుతో మోసగించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని సర్కిల్ కార్యా లయంలో శుక్రవారం సీఐ చరమందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా దుర్గి మండలం ఆడిగుప్పల గ్రామానికి చెందిన చల్లా పెద్దిరాజు, బత్తుల శ్రీను తమ వద్ద పంచలోహ వినాయకుడి విగ్రహం ఉందని, ఇంట్లో పెట్టుకుంటే మంచిదని హుజూర్‌నగర్ పట్టణానికి స య్యద్ మదార్‌ను నమ్మించారు. దీంతో మదార్ విగ్రహాన్ని కొనుగోలు చేస్తానని వారికి తెలిపాడు. ఈ నేపథ్యంలో బత్తుల శ్రీనుకు పరిచ యం ఉన్న కోదాడ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉప్పతల వినయ్, మద్దెల రజనికుమార్‌తో కలిసి పథకం ప్రకారం మదార్‌కు విక్రయించేందుకు ప్రయత్నించారు. ఈ నెల 26న మధ్యాహ్నం హుజూర్‌నగర్‌లోని రామస్వామి గట్టు వద్ద ఉంటున్న మదార్ ఇంటికి వెళ్లి పంచలోహ విగ్రహానికి డబ్బులు డిమాండ్ చేశారు. కానీ విగ్రహం ఇస్తే నే డబ్బులు ఇస్తానని మదార్ చెప్పాడు. దీంతో చల్లా పెద్దిరాజు, బత్తుల శ్రీను పంచలోహ విగ్రహానికి బదులుగా ఇత్తడి విగ్రహం అంటగట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మొదట రూ.1000లు ఇచ్చిన మదార్ అది పంచలోహ విగ్రహం కా దని గమనించి విగ్రహం వద్దని తన రూ. 1000 తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో అక్కడి నుంచి వారిద్దరు పరారయ్యారు. అనంతరం మదార్ హుజూర్‌నగర్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
విచారణ చేపట్టిన హుజూర్‌నగర్ పోలీసులు శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న చల్లా పెద్దిరాజు, బత్తుల శ్రీను, మద్దెల రజనికుమార్ ఉప్పతల వినయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు సీఐ చరమందరాజు తెలిపారు. సమావేశంలో ఏఎ్‌సఐ బలరామిరెడ్డి, పోలీసులు నాగరాజు, కాశీ తదితరులు పాల్గొన్నారు.