Share News

మాజీ ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ హౌస్‌అరెస్ట్‌

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:45 AM

తిరుమలగిరిలో సోమవారం సీఎం సభ జరుగుతున్న నేపథ్యంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ను హైదరాబాదులోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

మాజీ ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ హౌస్‌అరెస్ట్‌

మోత్కూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): తిరుమలగిరిలో సోమవారం సీఎం సభ జరుగుతున్న నేపథ్యంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ను హైదరాబాదులోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ ఇటీవల తిరుమలగిరిలో విలేకరులతో మాట్లాడుతూ ఎస్సారెస్సీ కాలువలకు నీరు విడుదల చేసిన తర్వాతే సీఎం తిరుమలగిరికి రావాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఆయనకు తుంగతుర్తికి వచ్చే అర్హత లేదని విమర్శించారు. దీంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సభకు ఆటంకం కల్గించకుండా ఉండేందుకుగాను పోలీసులు ముందస్తు చర్యగా హైద్రాబాదులో ఆయన్ను (మాజీ ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ను) సోమవారం తెల్లవారుజాము నుంచి హౌజ్‌ అరెస్టు చేశారు. ఆయన ఆఫీసు గదిలో, ఇంటి ముందు పోలీసులు మోహరించి ఆయన్ను బయటకు వెళ్లనివ్వలేదు.

Updated Date - Jul 15 , 2025 | 12:45 AM