శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
ABN , Publish Date - May 21 , 2025 | 12:24 AM
రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటించి అధిక దిగుబడులు పొందాలని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన ఉబ్బు వెంకటయ్య అన్నారు.
చౌటుప్పల్ రూరల్, మే 20,(ఆంధ్రజ్యోతి): రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటించి అధిక దిగుబడులు పొందాలని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన ఉబ్బు వెంకటయ్య అన్నారు. దేవలమ్మ నాగారంలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు అధ్యక్షతన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ సీజనకు ముందే మహోత్తరమైన మంచి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మంచి పరిణామం, శాస్త్రవేత్తలే రైతుల దగ్గరికి వచ్చి చేసే ఇటువంటి ప్రోగ్రాం రైతులకు బాగా ఉపయోగపడుతుందన్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని, చౌటుప్పల్ మార్కెట్లో రైతు బజార్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ కృష్ణ, డాక్టర్ స్పందన భట్ వ్యవసాయంలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే పద్ధతుల గురించి వివరించారు. కార్య్రకమంలో భువనగిరి సహాయ వ్యవసాయ సంచాలకులు వెంకటేశ్వర్లు డైరెక్టర్లు పబ్బు శ్రీకాంత, వ్యవసాయ విస్తరణ అధికారి పల్లె వెంకటేశం, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.