Share News

వరదొచ్చిందంటే.. గుండెల్లో దడ

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:34 AM

వానాకాలం వచ్చిందంటే చాలు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల గుండెల్లో దడ మొదలవుతుంది. హైదరాబాద్‌నగరంతోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన పక్షంలో... రాత్రికి రాత్రే మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది.

వరదొచ్చిందంటే.. గుండెల్లో దడ

భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోన్న మూసీ నది

రుద్రవెల్లి-జూలురు, సంగెం-బొల్లెపల్లి లోలెవల్‌ బ్రిడ్జీ మీదుగా పరవళ్లు

నిలిచిన బీబీనగర్‌, భువనగిరి, చౌటుప్పల్‌, భూదాన్‌పోచంపల్లి మండలాల ప్రజల రాకపోకలు

హైలెవల్‌ బ్రిడ్జీలకు మోక్షం లభించేనా?

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి) : వానాకాలం వచ్చిందంటే చాలు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల గుండెల్లో దడ మొదలవుతుంది. హైదరాబాద్‌నగరంతోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన పక్షంలో... రాత్రికి రాత్రే మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. వరద ఉధృతి పెరిగినప్పడల్లా జిల్లాలోని పలు మండలాలకు రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోతాయి. ఉదయం లేచి వేరే గ్రామానికి వెళ్దామంటే మూసీ ప్రమాదకరంగా పారుతూ కన్పిస్తుంది.

ఎగువన కురిసిన వర్షాలకు మూసీ వాగులు పొం గిపొర్లుతున్నాయి. చౌటుప్పల్‌ మండలం నేలపట్ల వద్ద ఈ నెల 8వ తేదీన ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ కాలువపై నుంచి కారు వెళ్లలేక చిక్కుకుంది. ఈకారులో ఇద్దరు చిన్నారులతోపాటు ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. వారు వెంట నే అప్రమత్తమై 100కు డయల్‌ చేయడంతో పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని తాడు సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. ఈ నెల నాలుగో తేదీన వలిగొండ మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన నలుగురు పశువుల కాపరులు మూసీ వాగులో చిక్కుకున్నారు. వీరు కూడా 100కు డయల్‌ చేయడంతో వెంటనే రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టి..., వీరిని బయటకు తీసుకొచ్చిన విషయం విధితమే.

ప్రమాదకరంగా ప్రయాణం

వ్యవసాయ పనులు చేసేవారితోపాటు పశువుల కాపరులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. జిల్లాలోని బీబీనగర్‌ మండలం రుద్రవెల్లి-జూలూరు లోలెవల్‌ బ్రిడ్జీ మీదుగా భూదాన్‌పోచంపల్లి, చౌటుప్ప ల్‌ మండలాలకు వెళ్లే పరిస్థితి ఉండదు. అదేవిధంగా వలిగొండ మండలం సంగెం-బొల్లెపల్లి బీమలింగం క త్వ మీదుగా భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌ మం డలాలకు దారులు మూసుకుపోతాయి. జిల్లాయంత్రాంగం భారీకేడ్‌లను ఏర్పాటుచేస్తుంది. దీంతో వీరంతా వర్షాకాలంలో సుదూర ప్రయాణాలు చేయా ల్సి వస్తోంది. దశాబ్దాలుగా ఈ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు. మూసీ నదిపై ప్రస్తుతం లోలెవల్‌ బ్రిడ్జీలు ఉన్నాయి. భారీ వర్షాలు కరిసిన పక్షంలో బ్రిడ్జీపై నుంచి మూసీ పరవళ్లు తొక్కుకుంటూ ముందుకు సాగుతుంది. దీంతో వరద ఉధృతి తగ్గే వరకూ పలు మండలాలకు రాకపోకలు నిలిచి పోవాల్సిందే. హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న బీబీనగర్‌ మండలంలోని రుద్రవెల్లి-జూలూరు బ్రిడ్జీ నిర్మాణానికి మోక్షం లభించడంలేదు. 2016లో ప్రస్తుతం ఉన్న లోలెవల్‌ బ్రిడ్జీ పక్కనుంచి హైలెవల్‌ బ్రిడ్జీని నిర్మించేందు

కు అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ బ్రిడ్జీ నిర్మాణానికి అంచనాలు రూపొందించి..., మొదటగా రూ.5.05కోట్లు మంజూరుచేసింది.

ఈ నిధులతో 20మంది రైతుల వద్ద 2.04ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించడమే కాకుండా..., కొన్ని పిల్లర్ల వరకు అసంపూర్తిగా నిర్మాణాలు చేపట్టింది. ఏడు సంవత్సరాలుగా పిల్లర్ల స్థాయిలోనే పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ప్రభుత్వం మరోసారి అదనంగా మరో రూ.10.80కోట్లు మంజూరు చేసింది. అయితే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూసీ ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జిల్లాలోని వలిగొండ మండలం సంగెం వద్ద భీమలింగం కత్వను పరిశీలించారు. ఈ ప్రాంతంలోని లోలెవల్‌ బ్రిడ్జీల స్థానంలో హైలెవల్‌ బ్రిడ్జీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు సీఎం హామీతో తమ కష్టాలు తీరి, వర్షాకాలంలోనూ తాము మూసీ నదిపై నుంచి రాకపోకలు సాగిస్తామని ఆశతో ఉన్నారు. ఈ ప్రాంత ప్రజల తిప్పలు ఎప్పటివరకు తీరేనా అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి చొరవతో..: ముఖ్యమంతి ఎనుముల రేవంత్‌రెడ్డి గత సంవత్సరం నవంబరులో వలిగొండ మండలం సంగెం బ్రిడ్జీ వద్ద చేపట్టిన మూసీ పునరుజ్జీవం పాదయాత్ర చేపట్టారు. స్థానిక ప్రజలు మూసీ కాలుష్యంతో పడుతున్న ఇబ్బందులను, మూసీ ప్రక్షాళన అవశ్యకతను వివరించారు. ఈ ప్రాంతంలోని వివిధ కులవృత్తులు, రైతులతో మమేకమయ్యారు. సంగెం వద్ద వాహనం నుంచి మూసీ పరివాహక ప్రాంత ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మూసీ ప్రక్షాళన ఒక సంకల్పంతో చేపట్టామని, ఎవరు అడ్డుపడ్డా చేస్తామని ప్రకటించారు. మూసీ నది ఉప్పొంగినప్పుడు సంగెం-వలిగొండ, జూలూరు-పెద్దరావులపల్లి అండర్‌ బ్రిడ్జీలు మునిగిపోవడంతో భువనగిరి, బీబీనగర్‌, చౌటుప్పల్‌, వలిగొండ మండలాలకు రాకపోకలు నిలిచిపోతాయని, ఈ ప్రాంతంలో నూతనంగా ఫ్లైఓవర్‌ బ్రిడ్జీలు నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి విన్నవించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఈ ప్రాంతంలో నిర్మించాల్సిన బ్రిడ్జీలపై పూర్తిస్థాయి నివేదికను అందించాలని, వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు సంబంధిత అధికారులు బ్రిడ్జీ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి నివేదించారు. హైలెవల్‌ బ్రిడ్జీ నిర్మాణంకోసం రూ.45కోట్ల అంచనాలు రూపొందించారు. రాష్ట్ర రహదారి నిర్మాణంలో భాగంగా రోడ్లు భవనాల శాఖ కింద ప్రభుత్వం అదనపు గ్రాంట్‌ కింద నిధులు మంజూరుచేసింది. బ్రిడ్జీ నిర్మాణంపై డీపీఆర్‌ పూర్తయిందని, పనులు ప్రారంభించనున్నట్టు అర్‌అండ్‌బీ అధికారులు వెల్లడించారు.

బొల్లెపల్లి-సంగెం వద్ద హైలెవల్‌ బ్రిడ్జీకి రూ.45కోట్లు మంజూరు ..

భారీ వర్షాలు కురిసిన పక్షంలో భువనగిరి, బీబీనగర్‌, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌ మండలాలకు రాకపోకలు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈనేపథ్యంలో తాజా ప్రభుత్వం బొల్లెపల్లి-సంగెం వద్ద హైలెవల్‌ బ్రిడ్జీని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. మూ సీ లోలెవల్‌ బ్రిడ్జీ కిలోమీటరు 3నుంచి3/6వరకు హైలెవల్‌ బ్రిడ్జీ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకోసం రూ.45కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ బ్రిడ్జీ నిర్మాణానికి త్వరలోనే టెండర్ల ప్రక్రియను చేపట్టి..., పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న లోలెవల్‌ బ్రిడ్జీస్థానంలో హైలెవల్‌ బ్రిడ్జీ నిర్మాణంతోనే భువనగిరి, బీబీనగర్‌, వలిగొండ మండలాల్లోని ప్రజలు భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌ ప్రాంతాలకు సులువుగా వెళ్లనున్నారు. ఈ బ్రిడ్జీ నిర్మాణంతో వానాకాలంలో ప్రాంతం ప్రజలకు కష్టాలు తప్పనున్నాయి.

రుద్రవెల్లి-జూలూరు బ్రిడ్జీ నిర్మిస్తే..

బీబీనగర్‌ మండలం రుద్రవెల్లి-జూలూరు లోలెవ ల్‌ బ్రిడ్జీని హైలెవల్‌ బ్రిడ్జీగా నిర్మించిన పక్షంలో బీబీనగర్‌ మండలం నుంచి భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌ మండలాలకు రాకపోకలు సులువుగా వెళ్లేందు కు వీలుంటుంది. అదేవిధంగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి నుంచి వచ్చే వాహనాలు వయా చౌటుప్పల్‌ మీదుగా వరంగల్‌, విజయవాడ వెళ్లాలంటే ఈ బ్రిడ్జీపై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ బ్రిడ్జీని హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. మూసీ ఉధృతంగా ప్రవహించిన పక్షంలో జాతీయ రహదారుల నుంచి వచ్చే వాహనాలు ఘట్‌కేసర్‌ వద్ద గల అవుటర్‌రింగ్‌ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీం తో ప్రయాణ దూరం బాగా పెరిగుతోంది. రుద్రవెళ్లి-జూలూరు బ్రిడ్జీ నిర్మాణం పూర్తయిన పక్షంలో భూ దాన్‌పోచంపల్లి మీదుగా వరంగల్‌, సంగెం వద్ద బ్రిడ్జీ ని నిర్మించిన పక్షంలో చౌటుప్పల్‌ మీదుగా భువనగి రి వరకు చేరుకోవచ్చు. ఈ ప్రాంతంలో రోడ్డు వెడ ల్పు పనులు చేపట్టినప్పటికీ, బ్రిడ్జీ పనులు మాత్రం ఏడెనిమిదేళ్లుగా అసంపూర్ణంగా ఉన్నాయి.

Updated Date - Aug 12 , 2025 | 12:34 AM