Share News

15లోగా ‘ఫిట్‌నెస్‌’ పరీక్ష

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:24 AM

పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రైవేట్‌ విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నె్‌సపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంజినీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కోర్సుల కళాశాలలున్నాయి.

15లోగా ‘ఫిట్‌నెస్‌’ పరీక్ష

ప్రైవేట్‌ విద్యాసంస్థల బస్సులపై ఆర్టీఏ దృష్టి

ఈ నెల 15వరకు అవకాశం

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రైవేట్‌ విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నె్‌సపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంజినీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కోర్సుల కళాశాలలున్నాయి. నిత్యం బస్సుల్లో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. కొద్దిపాటి నిర్లక్ష్యంతో అత్యంత విలువైన ప్రాణాలు గా ల్లో కలుస్తున్నాయి. ప్రమాదాల భారిన పడిన ఎన్నో కు టుంబాలు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి.

ప్రైవేట్‌ విద్యాసంస్థల బస్సులకు ఫిట్‌నెస్‌ లేకపోవడం, అనుభవంలేని డ్రైవర్లను నియమించడంతో జిల్లాలో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రైవేట్‌ విద్యాసంస్థల బస్సులపై ఆర్టీఏ దృష్టి సారించింది. రోడ్డు రవాణా శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలలు 171 ఉండగా, ఇంటర్‌ కళాశాలలు 30, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో 16, ఇంజినీరింగ్‌, తదితర వృత్తి విద్యా కళాశాలలు 25వరకు ఉన్నాయి. ఈ విద్యాసంస్థలకు చెందిన బస్సులు 180 వరకు నడుస్తున్నాయి. ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల కు చెందిన బస్సులను ప్రతీ సంవత్సరం విధిగా ఫిట్‌నెస్‌ చేయించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు వరకు ఫిట్‌నెస్‌ చేసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేర కు విధిగా విద్యా సంస్థలకు చెందిన బస్సులను ఫిట్‌నెస్‌ చేసుకోవాలని సూచించారు. ఫిట్‌నెస్‌ వెంటనే చేయించుకోవాలని రవాణా శాఖ అధికారులు సంబంధిత పాఠశాలల యాజమన్యాలకు సమాచారాన్ని అందించారు. ఈ నెల 15వ తేదీలోగా ఫిట్‌నెట్‌ చేసుకోవాలని గడువు విధించారు. ఈ మేరకు జిల్లాలోని..

ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులు నడిపితే చర్యలు : సాయికృష్ణ, జిల్లా రవాణా శాఖ అధికారి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్‌ విద్యాసంస్థల బస్సులు విధిగా ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ పొందాలి. జూన్‌ 15వరకు వాహనాలు ఫిట్‌నెస్‌ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఫిట్‌నెస్‌ చేసుకోని పక్షంలో బస్సులు సీజ్‌ చేస్తాం. రోడ్డు భద్రతపై పకడ్బందీగా వ్యవహరిస్తాం. మోటార్‌ వాహన చట్టాలు అమల్లో కఠినంగా వ్యవహరిస్తాం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటాం. రోడ్డు భద్రతపై అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. పాఠశాలల యాజమాన్యాలు, డ్రైవర్లతో సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. రవాణా చట్టం ప్రకారం నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.

ప్రైవేట్‌ విద్యా సంస్థలు పాటించాల్సిన నిబంధనలు

విద్యాసంస్థల పేరు, టెలిఫోన్‌ నెంబర్లు, మొబైల్‌ నెంబ ర్లు సహా పూర్తి చిరునామాను బస్సు ఎడవైపున, ముందు భాగంలో స్పష్టంగా కన్పించేలా రాయించాలి. పాఠశాలల బస్సుల డ్రైవర్లుగా నియమించబడే వ్యక్తులకు 60 ఏళ్లకు మించి ఉండరాదు. యాజమాన్యాలు ప్రతీ బస్సు డ్రైవర్‌ ఆరోగ్య పట్టిక(హెల్త్‌కార్డు)ను నిర్వహించాలని, మూడు నెలలకోసారి తమ సొంత ఖర్చుపై రక్తపోటు, బీపీ, షుగ ర్‌, కంటిచూపు వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను ప్రతీ మూడు నెలలకోసారి చేయించాలి. రికార్డులను జాగ్రత్త పర్చాలి. డ్రైవర్లను నియమించే ముందు లైసెన్స్‌, ఇతర పేపర్లలో నిజానిజాలను తెలసుకునేందకు ఆర్టీను సంప్రదించాలి. కనీసం ఐదేళ్లపాటు అదే కేటగిరీ వాహనాన్ని నడిపిన అనుభవంగల వారినే నియమించాలి. డ్రైవర్ల వివరాలు పేరెంట్స్‌ కమిటీకి తెలపాల్సి ఉంటుంది. బస్సు కండిషన్‌పై పాఠశాలల యాజమాన్యాలు, పేరెంట్‌ కమిటీలు తనిఖీలు చేయాలి. ప్రతీ వాహనానికి అత్యవసర ద్వారం (ఎమర్జెన్సీ ఎగ్జిట్‌) కల్పించి, స్పష్టంగా రాయాలి. బస్సుల్లో అవసరమైన మందులతో కూడిన ప్రథమ చికిత్స (ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌)ను అందుబాటులో ఉంచాలి. యాజమాన్యం బస్సుల పార్కింగ్‌కోసం విద్యాసంస్థల ఆవరణలోనే స్థలం కేటాయించాల్సి ఉంటుంది. విద్యార్థుల సంరక్షణ నిమిత్తం వారు పాఠశాలల ఆవరణలోనే బస్సులు ఎక్కడం, దిగడం చేయాలి. ప్రతీ విద్యా సంస్థ బస్సు కనీసం ఒక అటెండర్‌ను కలిగి ఉండాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సు అటెండర్‌ బస్సును నడిపించేందుకు అనుమతించకూడదు. డ్రైవర్లకు యూనిఫాం ధరించాలి. బస్సులకు రూట్‌ప్లాన్‌ తప్పకుండా ఉండాలి. విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించిన లిస్టు ఉండాలి. బస్సు ఇంజిన్‌ కాంపార్ట్‌మెంట్‌లో ఒక అగ్నిమాపక యంత్రం (ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌) పొడి అందుబాటులో ఉండాలి. పాఠశాల, కళాశాల బస్సు అని 100 ఎం.ఎం. సైజు అక్షరాలతో ఉండాలి. బస్సు డ్రైవర్లు ప్రతీ సంవత్సరం రవాణా శాఖ అధికారులకు నిర్వహించే పునశ్చరణ శిక్షణలో పాల్గొనాలి. ఏ విద్యా సంస్థ బస్సు అయినా సరే పరిమిత సీటింగ్‌ కెపాసీటీ కన్న ఎక్కువ మంది విద్యార్థులను తీసుకెళ్లకూడదు. ప్రతీ పది బస్సులకు ఒకటి అదనంగా (స్పేర్‌) కనీసం ఒక బస్సు కలిగి ఉండాలి. విద్యా సంస్థల యాజమాన్యం, రవాణా, పోలీసు, విద్యాశాఖ సౌజన్యంతో విద్యార్థులకు ఒకరోజు రోడ్‌సేఫ్టీ తరగతులు నిర్వహించాలి.

స్కూల్‌ బస్సు యాప్‌ : ప్రభుత్వం ‘టీఎస్‌ స్కూల్‌ బస్సు’ అనే యాప్‌ను ప్రవేశపెట్టింది. ఆన్‌రైడ్‌ ఫోన్లుగల వారు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకు న్న పక్షంలో... ప్రైవేట్‌ పాఠశాలలకు సంబంధించిన బస్సుల పూర్తి వివరాలను అందులో నమోదుచేశారు. పిల్లల తల్లిదండ్రులకు బస్సు డ్రైవర్‌ ఎవ రూ? కండిషన్‌లో ఉందా? లేదా? అనే వివరాలను అందుబాటులోకి రానున్నాయి. ఈ యాప్‌పై రవా ణా శాఖ అధికారులు ప్రచారాన్ని చేపడుతున్నారు. ప్రైవేట్‌ యాజమాన్యాలు పాటించాల్సిన నిబంధనలపై తల్లిదండ్రులకు, డ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని పాఠశాలల్లోనూ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:24 AM