Share News

పోచంపల్లి ఇక్కత్‌కు ఫిదా

ABN , Publish Date - May 21 , 2025 | 12:33 AM

చేనేత కళాకారులు కళానైపుణ్యంతో నేసి న పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలు ఫ్యాషన్‌ సొబగులతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల భూదాన్‌పోచంపల్లి సందర్శించిన ప్రపంచ సుందరీమణులను పో చంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత్‌ పట్టు చీరలు ముగ్ధులను చేశాయి.

పోచంపల్లి ఇక్కత్‌కు ఫిదా

ముగ్ధులైన ప్రపంచ సుందరీమణులు

పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలతో ఆకట్టుకున్న ఇండియన్‌ మోడల్స్‌

(ఆంధ్రజ్యోతి,భూదాన్‌పోచంపల్లి) : చేనేత కళాకారులు కళానైపుణ్యంతో నేసి న పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలు ఫ్యాషన్‌ సొబగులతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల భూదాన్‌పోచంపల్లి సందర్శించిన ప్రపంచ సుందరీమణులను పో చంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత్‌ పట్టు చీరలు ముగ్ధులను చేశాయి. పోచంపల్లి ఇక్కత్‌ డిజైన్లు ఎంతగానో ఆకట్టుకున్నాయని, వీటికి ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రా చుర్యం తెస్తామని ప్రపంచ సుందరీమణులు కితాబు ఇచ్చారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న మిస్‌వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ సుందరీమణులు పోచంపల్లి ఇక్కత్‌ డిజైన్లకు ఫిదా అయ్యారు. పోచంపల్లిలో ఇక్కత్‌ వస్త్రాలకు ఫ్యాషన్‌ను జోడించి తయారుచేసిన దుస్తులతో చేసిన ర్యాంప్‌ వాక్‌ ముద్దుగుమ్మలను ఆకట్టుకుంది. ప్రపంచ ఫ్యాషన్‌ పోకడలకు అనుగుణంగా దుస్తులను తయారు చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని కళాకారులు అభిప్రాయపడ్డారు. ప్రముఖ డిజైనర్‌ జోసఫ్‌ సుందరన్‌ నేతృత్వంలో మోడల్స్‌ నిర్వహించిన ర్యాంప్‌ వాక్‌ ప్రపంచ సుందరీమణులను ఆకర్షించింది. ఇక్కత్‌ను ప్రపంచానికి పరిచయం చేయడంతో చేనేత కళాకారులకు మరింత ఉపాధి పొందే వీలుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంప్రదాయానికి ఆధునిక రూపం

ఇక్కత్‌ వస్త్రాలంటే మహిళల చీరలు, పురుషులకు సంబంధించిన ధోతి, చొక్కా, ప్యాంట్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. కాగా, పోచంపల్లి చేనేత కార్మికులు 22 రకాలుగా ఆధునిక డిజైన్లలో రూపొందించిన వస్త్రాలు ఔరా! అనిపించా యి. పోచంపల్లి రూరల్‌ టూరిజం సెంటర్‌లోని మ్యూజియంలోని లీవ్‌టుక్లాత్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాల తయారీ ప్రక్రియలపై గ్యాలరీ వీక్షించేందుకు వీలు కల్పించారు. వివిధ దేశాలకు చెందిన వస్త్రధారణ డిజై న్ల కొలతలు తీసుకుని ముడి ఇక్కత్‌ వస్త్రంతో సుందరీమణుల సందర్శన నిమిత్తం ఇక్కడ గ్యాలరీ ఏర్పాటు చేశారు. టాప్స్‌, నైటీస్‌, ఫ్రాక్స్‌, ఆఫ్రికన్‌ గౌన్‌, కుర్తా, గాగ్రాలు తయారు చేసి మోడల్స్‌కు సూట్‌ అయ్యే లా ఫ్యాషన్‌ డిజైన్లర సమక్షం లో రూపొందించారు. న యా ఇక్కత్‌ వస్త్రాలను ధరించిన మోడల్స్‌ చేసిన ర్యాంప్‌ వా క్‌ ఆహూతులను అలరించాయి. అం దాలభామల సమక్షంలో రకరకాల ఇక్కత్‌ వస్త్రాలను ధరించి నిర్వహించిన షో అందరినీ ఆకట్టుకుంది. అదిరేటి లుక్కులతో.. ఫొటోలకు పోజులిస్తూ హొయలు ఒలికిస్తున్న వేళ.. తళుక్కుమన్న ఇక్కత్‌ వస్త్రాలను సుందరీమణులు కళ్లార్పకుండా వీక్షించారు. సంప్రదాయ వస్త్రాలు తయారు చేసే చేనేత కళాకారులు ఆధునికతను జోడించి ట్రెండీగా రూపొందించి ఆహూతులను ఆశ్చర్యానికి గురిచేశారు.

ఇక్కత్‌ వస్త్రాలు పలు రకాలు...

వార్ప్‌ ఇక్కత్‌ అంటే సాధారణ రంగు, పేకను ప్రవేశపెట్టి వస్త్రాన్ని ఉత్పత్తి చేయడానికి ముందే మగ్గంపై పడుగు దారాల్లో నమూనాలు స్పష్టంగా కనిపించేలా డిజైన్‌ చేస్తారు. వెప్ట్‌ ఇక్కత్‌లో అద్దకం వేసిన నమూనాలను కలిగి ఉండే పేక దారాన్ని నేతన్నలు తిప్పుతున్న కొద్దీ కనిపిస్తుంది. వార్ప్‌ ఇక్కత్‌తో పోలిస్తే వెప్ట్‌ ఇక్కత్‌లో నేత నెమ్మదిగా ఉంటుంది. పేక వరుసలు డిజైన్‌ను ఏర్పరుస్తున్నప్పుడు నమూనాల స్పష్టతను కొనసాగించేందుకు జాగ్రత్తగా సర్దుబాటుచేయాల్సి ఉంటుంది. డబుల్‌ ఇక్కత్‌ అం టే మగ్గంపై పేర్చడానికి ముందు పడుగు, పేక రెండూ డైయింగ్‌ చేస్తారు. ఇలా రూపొందించే వస్త్రానికి డబుల్‌ ఇక్కత్‌ అని పేరు. దేశ, విదేశాల ప్రతినిధులు పోచంపల్లి పర్యాటక కేంద్రా న్ని సందర్శించినపుడు వారికి ఇక్కత్‌ అంటే ఏమిటి? డబుల్‌ ఇక్కత్‌ అంటే ఏమిటి? వాటి ప్రాధాన్యం, ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.

పోచంపల్లి ఇక్కత్‌కు జీఐఏ ట్యాగ్‌ తి: భారత లవకుమార్‌, అధ్యక్షుడు, పోచంపల్లి చేనేత టైఅండ్‌డై అసోసియేషన్‌

ప్రపంచ సుందరీమణుల మనసు దోచిన పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలకు భౌగోళిక గుర్తింపు రావడం, (జీఐఏ) ట్యా గ్‌ కలిగి ఉండడం, డబుల్‌ ఇక్కత్‌ వస్త్రాలు నేయడం, ప్రపంచంలోనే ఇలాంటి క్లిష్టమైన వస్త్రాలను చేతితో తయారు చేయడం ఇక్కడి కళాకారుల నైపుణ్యం అద్భుతం. పోచంపల్లికి సుందరీమణులు వచ్చిన తర్వాత దేశ విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. పోచంపల్లి పట్టణంలోని దుకాణదారులకు వస్త్ర వ్యాపారం క్రమేణ పెరుగుతోంది.

మూసధోరణి వీడాలి : సాయిని భరత్‌, చేనేత జాతీయ అవార్డు గ్రహీత, భూదాన్‌పోచంపల్లి

వినియోగదారుడి అభిరుచులకు అనుగుణంగా చేనేత కళాకారుడు డిజైన్లలో మార్పులు తీసుకురావాలి. అప్పుడే చేనేత రంగం ప్రాచుర్యం మరింత పెరుగుతుంది. నేటి ఆధునిక ఫ్యాషన్‌కు అనుగుణంగా కళాకారులు సైతం ఆలోచన చేసి మూసధోరణిలో కాకుండా వినూత్నమైన డిజైన్లు రూపొందించాల్సిన అవసరం ఉంది.

ప్రపంచ దేశాల్లో ‘పోచంపల్లి ఇక్కత్‌’కు బహుళ ప్రాచుర్యం : తడక రమేష్‌, చేనేత జాతీయ అవార్డు గ్రహీత, భూదాన్‌పోచంపల్లి

భూదాన్‌పోచంపల్లికి ప్రపంచ సుందరీమణుల సందర్శనతో ‘పోచంపల్లి ఇక్కత్‌’కు ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యం కలుగుతోంది. చేనేత కళాకారులు నేసిన వస్త్రాలకు మంచి గుర్తింపు రావాలంటే మార్కెటింగ్‌తోనే సాధ్యమవుతుంది. వారు నేసిన వస్త్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేయగలిగితేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందుకోసం ఇక్కత్‌ వస్త్రాలకు ఫ్యాషన్‌ మెరుగు లు దిద్దడం ఎంతో అవసరం. పోచంపల్లి టూరిజంలోని ఇక్కత్‌ డ్రెస్సుల్లో మోడల్స్‌ నిర్వహించిన ర్యాంప్‌ వాక్‌ సుందరీమణులను ఎంతగానో అలరించింది. ప్రపంచ దేశాల్లో బహుళ ప్రచారం సాగిస్తామని వారు కితాబు పలకడం హర్షదాయకం. ఇప్పుడిప్పుడే మార్కెటింగ్‌ పెరుగుతోంది.

Updated Date - May 21 , 2025 | 12:33 AM